సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా సూపర్ సైక్లోన్ 'అంఫాన్' కొనసాగుతోంది. ఈ తుపాన్ పారాదీప్‌కు దక్షిణంగా 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ రేపు(బుధవారం) సుందర్‌బన్స్‌కు సమీపంలో అంఫాన్ అతి తీవ్ర తుపానుగా మారనుంది. డిఘ-హతియా తీరం వద్ద ‘అంఫాన్’ తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. (అంఫన్‌తో జాగ్రత్త)
తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం పోర్టుల్లో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment