Cyclone Amphan
-
49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా
భువనేశ్వర్ : ఒడిశాలో ఉంపన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొన్న 49 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్లో తుఫాను సృష్టించిన బీభత్సం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రెస్యూ ఆపరేషన్ అనంతరం ఒడిశా తిరిగివచ్చారు. వీరిలో జూన్ 3న ఒకరికి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు బృందంలోని మిగతా 173 మందికి పరీక్షలు జరపగా 49 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరంతా కటక్‌లోని ముండలి ప్రాంతానికి చెందిన 3వ బెటాలియన్‌కు చెందినవారని అధికారులు పేర్కొన్నారు. కరోనా వచ్చిన వారిని ఎన్డీఆర్ఎఫ్ శిబిరంలోని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. అయితే పశ్చిమబెంగాల్లో సహాయక చర్యల్లో భాగంగా ఒడిశా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన 376 మంది, ఒడిశా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 271 మంది కూడా పాల్గొన్నట్లు వివరించారు. వీరందరి నమూనాలు ల్యాబ్‌కు పంపించామని ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) మరోవైపు డీఆర్డీవో యూనిట్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. బాలాసోర్ జిల్లాలోని ఈ సంస్థలో మిలిటరీ విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లకు కోవిడ్ ఉన్నట్లు తేలింది. వీరు ఇటీవల రెస్యూ ఆపరేషన్‌లో భాగంగా కోల్‌కతా వెళ్లారు. పిఎక్స్ఇ సైనిక శిబిరానికి వెళ్ళిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) బృందంలోని ఎనిమిది మంది జవాన్లు కోవిడ్ బారిన పడటంతో వారిని క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం ఐటీఆర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఉంపన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కేంద్రం 19 ప్రత్యేక బృందాలను పశ్చిమ బెంగాల్‌కు పంపించింది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి తిరిగి వచ్చిన బృందాల్లో కరోనా కేసులు బయటపడటంతో ఆందోళన మొదలైంది. (కరోనాపై తప్పుడు వార్తలకు ట్విటర్ చెక్ ) -
భారత్‌కు ఫ్రాన్స్ భారీ రుణ సాయం!
పారిస్/న్యూఢిల్లీ: భారత్‌కు 200 మిలియన్ యూరోల మేర రాయితీలతో కూడిన రుణాన్ని మంజూరు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. కోవిడ్-19, భయంకర ఉంపన్ తుపాను కారణంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఈ మేరకు సాయం అందిస్తున్నట్లు ఫ్రాన్స్ దౌత్యవర్గాలు వెల్లడించాయి. కాగా ఉంపన్ తుపాను భారత్‌లో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తుపాను బాధితులకు సహాయం చేస్తామని ఆయన స్నేహహస్తం అందించారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ భారత్‌లోని కోవిడ్-19, తుపాను బాధితులను ఆదుకునేందుకు 200 మిలియన్ యూరోల రుణసాయం అందించనుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. (పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్) ఇక రుణ మంజూరుకు సంబంధించిన ప్రక్రియ పూర్తైందని.. భారత్‌లోని బలహీన వర్గాలకు సామాజిక రక్షణ కల్పించేందుకు ప్రపంచ బ్యాంకు అందించిన సాయానికి ఇది ఊతంలా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మార్చి 31న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్లో సంభాషించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయం అందించుకోవాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఫ్రాన్స్ ప్రారంభించిన కోవిడ్ టూల్స్ ఆక్సిలేటర్(ఏసీటీ- ఏ) ఇనిషియేటివ్(జీ-20)కు మద్దతు పలకాల్సిందిగా మాక్రాన్ ఈ సందర్భంగా భారత్‌ను కోరినట్లు సమాచారం.(చదవండి: చైనాకు మద్దతు పలికిన నేపాల్!) -
బెంగాల్లో జూన్ 30 వరకు స్కూళ్లు బంద్
కోల్‌కతా: కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్డౌన్ ప్రస్తుతం ఉంఫన్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్లో జూన్ 30 వరకు యదావిధిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎనిమిది జిల్లాల్లో ఉంఫన్ తుఫాను కారణంగా అనేక పాఠశాల భవనాలు దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. అయితే 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని గతవారం ప్రకటించినట్లే జూన్ 29 నుంచే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. (స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు) దాదాపు 1,058 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే తుఫాను కారణంగా 462 పరీక్షా కేంద్రాలు దెబ్బతిన్నాయని అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొన్ని పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. అవసరమైతే మరికొన్ని కాలేజీ భవనాలను కూడా ఎగ్జామ్ సెంటర్లుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. మిడ్నాపూర్, బుర్ద్వాన్, నాడియా, హూగ్లీ, హౌరా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఉంఫన్ కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. దాదాపు తుఫాను కారణంగా స్కూళ్లు, పాఠశాలలు దెబ్బతిని 700 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని పార్థా ఛటర్జీ వెల్లడించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. (సరిహద్దులో ఉద్రిక్తత: రంగంలోకి మళ్లీ అదే టీం?! ) -
బెజవాడలో బేజారెత్తిస్తున్న ఎండలు
సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాను వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. సాధారణం కంటే నాలుగు నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మున్ముందు ఇవి మరింత ప్రతాపం చూపించనున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఎండలు నిప్పుల వర్షాన్ని తలపిస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం ఏడెనిమిది గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి మరింత మండుతున్నాడు. ఇలా సాయంత్రం వరకూ సెగలు కక్కుతున్నాడు. రాత్రి వేళ కూడా వేడిగాలులు వీస్తూ జనాన్ని అవస్థలు పెడుతున్నాయి. దీంతో తెల్లారిందంటే చాలు.. మళ్లీ వడగాడ్పులు ఎలా ప్రతాపం చూపుతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. నెలాఖరు వరకూ ఇదే విధమైన ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో నాలుగు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. విజయవాడలో అత్యధికం జిల్లాలో శనివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న విజయవాడలో అత్యధికంగా 45.1, రూరల్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీరులపాడులో 44.2, తిరువూరు 43.2, చందర్లపాడు 42.9, విజయవాడ నగరం, గన్నవరం విమానాశ్రయంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణీ కార్తెలో.. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఇప్పటికే వడగాడ్పుల తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. రోహిణీ కార్తె ప్రవేశిస్తే గాడ్పుల తీవ్రత మరింత పెరగనుంది. రానున్న రెండు రోజులు కృష్ణా జిల్లాలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ఎందుకిలా? ఇటీవల సంభవించిన ఉంపన్ తుపాను గాలిలో తేమను లాక్కుని పోయింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రం వైపు ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ, వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఇవి ఉష్ణగాలులను మోసుకు వస్తున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడగాడ్పుల వేళ జనం ఇళ్లలోనే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే గొడుగు ధరించాలి. తలకు, ముఖానికి మాస్క్/కర్చీఫ్ కట్టుకుని వెళ్లాలి. బయటకు వెళ్లి వచ్చాక తీపి పదార్థాలు తినకూడదు. తరచూ మంచినీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం నీళ్లు తాగాలి. తెల్లని కాటన్ వస్త్రాలు ధరించాలి. ఐస్ నీళ్లు, కూల్డ్రింకులు తాగకూడదు. -
ఉంపన్: ‘పెద్ద నష్టమేమి జరగలేదు’
కోల్‌కతా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న ఆపత్కాలంలో పులి మీద పుట్రలా ప్రళయ భీకర ఉంపన్ తుపాను పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను దాటికి పదుల సంఖ్యలో ప్రాణాలు, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్థి నష్టం జరిగింది. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. అయితే దేశంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఈడెన్ గార్డెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘ఉంపన్ తుపాన్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భీకర తుపానుతో పిచ్, ఔట్ ఫీల్డ్ పూర్తిగా దెబ్బతినడం మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాం. వేగంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల అద్దాలు పలిగాయి, కొన్ని బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక ఇంజనీర్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా పరిశీలించి మాకు రిపోర్టు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఎలాంటి తుపానుల వచ్చినా తట్టుకొనే విధంగా పలు నిర్మాణాలను చేపట్టాలనుకుంటున్నాం’ అంటూ అవిషేక్ దాల్మియా పేర్కొన్నాడు. ఉంపన్ తుపాను సృష్టించిన ప్రళయ భీభత్సం చదవండి: ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం ‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’ -
ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ పెను తుపాను ‘ఉంపన్’ సృష్టించిన బీభత్సం గురించి కేంద్ర ప్రభుత్వంగానీ, జాతీయ మీడియాగానీ అంతగా పట్టించుకోక పోవడం పట్ల మేధావులతోపాటు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి ఏరియల్ సర్వే చేసి తుపాను బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించినా ‘జాతీయ విపత్తు’గా ప్రకటించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ, ప్రముఖ జర్నలీస్ట్ వీర్ సాంగ్వీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని విమర్శించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను) బెంగాల్ ప్రజలు గడచిన గత ఐదు దశాబ్దాలుగా జాతీయ పార్టీలను కాదని, ప్రాంతీయ పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తున్నందుకు కేంద్రం, తమ రాష్ట్రంపై కక్షగట్టిందా? అని సాంగ్వీ ప్రశ్నించారు. ఉంపన్ సృష్టించిన విధ్వంసం జాతీయ మీడియాకు కనిపించక పోవడం ఆశ్చర్యంగాను, బాధగానూ ఉందంటూ బెంగాల్, ఒడిశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు ఓ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించారు. తుపాను సాయం కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఏ మూలకు సరిపోతుందని వారు ప్రశ్నించారు. మామూలు ప్రభుత్వ ప్రాజెక్టులకే ఎక్కువ ఇస్తారని వారన్నారు. కేంద్రం మాట అటుంచితే కరోనా వార్తల ఒరవడిలో బెంగాల్‌ను కుదిపేసిన తుపాను వార్తలను జాతీయ మీడియా పట్టించుకోలేదేమో! (ఉంపన్.. కోల్‌కతా వణికెన్) -
బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఇంత బీభత్సమా.. షాకయ్యాను
కోల్‌కతా: పెనుతుపాను ఉంపన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు రోజుల క్రితం పెను విధ్వంసం సృష్టించిన తుపాను గాయాల నుంచి బెంగాల్ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఉంపన్ బీభత్సంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత భయంకరమైన తుపానును నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను షాక్ అయ్యాను. మేము ఎవరితోనూ మాట్లాడలేకపోయాం. మేము సిద్ధం చేసిన మ్యాప్ ఉంది. దీన్ని ఆధారంగా ఉంపన్ తుఫాను కారణంగా ప్రభావితమైన దేశంలోని ప్రతి ప్రాంతానికి వెళ్తామ’ని మమతా బెనర్జీ అన్నారు. ఉంపన్ తుపాను తీరం దాటిన తరువాత పరిస్థితిని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మినాఖాన్, సందేశ్‌ఖాలి, నామ్ఖానా, గోసాబా, కుల్తాలి, కుల్పి, కాక్‌డ్విప్, ఫాల్టా ప్రాంతాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు. ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఉంపన్ తుపాన్‌తో బెంగాల్లో 80 మంది వరకు మృతి చెందగా, భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. (ఉంపన్.. కోల్‌కతా వణికెన్) రాష్ట్రపతికి కృతజ్ఞతలు కష్ట కాలంలో తమకు దన్నుగా నిలిచిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ‘తుఫాను కారణంగా తలెత్తిన సంక్షోభ సమయంలో వ్యక్తిగతంగా నాకు ఫోన్‌చేసి బెంగాల్ ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, మాకు అండగా నిలిచినందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జీకి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి తుపాను నష్టం గురించి వివరించినట్టు తెలిపారు. తుపాన్ కారణంగా అతలాకుతలమైన బెంగాల్‌కు రూ. 1000 కోట్ల సాయం అందించనున్నట్టు మోదీ ప్రకటించారు. (బెంగాల్‌కు వెయ్యి కోట్ల తక్షణ సాయం) -
మమత, నవీన్‌లకు మద్దతుగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉంఫాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్, ఒడిశాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవను కేజ్రీవాల్ అభినందించారు. ఈ సంక్షోభ సమయంలో మా వంతుగా మేము మీకు ఏవిధంగా సహాయపడగలమో తెలియజేయండి అంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ సీఎం కోరారు. తీవ్ర తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్లో ఇప్పటి వరకు దాదాపు 77 మంది మరణించినట్లు సమాచారం. చదవండి: ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, కోల్‌కతా, హౌరా, హూగ్లీ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, మౌళిక సదుపాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బెంగాల్, ఒడిశాలకు తమకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయపడతామని కేజ్రీవాల్ భరోసా కల్పించారు. సంక్షోభంలో ఉన్న రెండు రాష్ట్రాలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఉంఫాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని నరేంద్రమోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: తక్షణ సహాయం ప్రకటించిన ప్రధానమంత్రి -
బెంగాల్‌కు వెయ్యి కోట్ల తక్షణ సాయం
కోల్‌కతా : ఉంపన్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు రూ. వెయ్యి కోట్ల తక్షణ ఆర్ధిక సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తుపాను ధాటికి బెంగాల్లో ఇప్పటివరకు 80 మందికిపై మృత్యువాత పడగా, వేల ఎకరాల్లో పంట నష్టం, వంతెనలు కూలిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాను బీభత్స దృశ్యాలు ప్రత్యక్షంగా చూశానని, ఈ కష్ట సమయంలో బెంగాల్‌ను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు మోదీ తెలిపారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీ వదిలి బయటకి రాలేదు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత ఉంపన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించారు. లాక్డౌన్ సమయంలో ప్రధాని తొలి పర్యటన ఇదే కావడం విశేషం. చదవండి: ఉంపన్.. కోల్‌కతా వణికెన్ మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను: గంగూలీ -
మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను: గంగూలీ
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ కోల్‌కతా పోలీసుపై ప్రశంసల వర్షం కురుపిస్తున్నాడు. దేశమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. పశ్చిమ బెంగాల్‌ను మాత్రం ఉంపన్ తుపాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుపాను ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారి స్థానికులతో కలిసి ఆ చెట్లను పక్కకు లాగుతున్నాడు. రెండు రోజుల క్రితం కోల్‌కతా సౌత్ ఈస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పటికే పలువురు ప్రశంసలు పొందిన ఈ వీడియోను చూసిన గంగూలీ ‘కోల్‌కతా పోలీసులను చూసి ఎంతో గర్విస్తున్నాం’ అని ప్రశంసిస్తూ మరో సారి రీట్వీట్ చేశాడు. (ఉంపన్.. కోల్‌కతా వణికెన్) We leave no stone unturned. #WeCareWeDare @CPKolkata @KolkataPolice pic.twitter.com/zI6M6OngWl — DC SED Kolkata Police (@KPSoutheastDiv) May 21, 2020 ఉంపన్ ధాటికి రాష్ట్ర రాజధాని కోల్‌కతా చిగురుటాకులా ఒణికిపోతుంది. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.(బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) -
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఉంపన్ తుపాను బీభత్సం
-
ఉంపన్.. కోల్‌కతా వణికెన్
కోల్‌కతా/భువనేశ్వర్/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్ టవర్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సుందర్బన్ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో భారీగా పంట నష్టం ఉంపన్ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కరోనా కంటే భయంకరమైనది : మమత కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్ తుపాను కోవిడ్–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు. అండగా ఉంటాం: మోదీ పశ్చిమ బెంగాల్ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నేడు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ రాష్ట్రాలను ఆదుకుంటాం: అమిత్ షా
న్యూ ఢిల్లీ : ఉగ్ర రూపంతో విరుచుకుపడుతున్న ఉంపన్ తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము కూడా ఎప్పటికప్పుడు అంఫన్ తుపాను బీభత్సంపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తుపాను బాధిత రాష్ట్రాలైనా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రతి పౌరుడిని ఆదుకునే బాధ్యత తమ మీద ఉందన్నారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. (నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు) అదే సమయంలో ఎవరూ నివాసాల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ తుపాను విలయతాండవం వల్ల స్థంభించిపోయిన వ్యవస్థల పునరుద్ధరణ పనులు చేపట్టడం నిజంగా కష్టతరమేనని ఎన్టీఆర్ఎఫ్ డైరెక్ట్ జనరల్ ఎన్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ తుపాను వల్ల భారీ ఆస్థి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్‌పోర్టు నీట మునిగిపోగా దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రజలను గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. (బెంగాల్ తీరాన్ని తాకిన పెనుతుపాను) -
ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో ఉంపన్ తుపాను పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బెంగాల్లో ఉంపన్ వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. వేలమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి విధ్వంసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడాలని మమత కోరారు. మరోవైపు ఉంపన్ తీవ్ర రూపం దాల్చడంతో బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. రాజధాని కోల్కత్తా ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్కత్తా ఎయిర్పోర్ట్ పూర్తిగా నీట మునిగింది. (నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు) -
ఉంపన్: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు
కోల్‌కతా : ‘ఉంపన్’ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఉంపాన్ తీవ్ర రూపం దాల్చడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభంవించింది. రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. ఉంపాన్ దాటికి పశ్చిమబెంగాల్, ఓడిశా రాష్ట్రాల్లో యుద్ద పరిస్థితులు నెలకొన్నాయి. ఉంపన్ తుపాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన తరువాత ప్రస్తుతం కోల్‌కతా విమానాశ్రయాన్ని తాకింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. ఎయిర్‌పోర్టు నీటితో నిండిపోవడంతో విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. నీటితో నిండిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు దృశ్యాలు చూస్తుంటే పెను తుపాన్ ఉంపన్ ఎంత వినాశనం కలిగించిందో తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
జలదిగ్బంధంలో కోల్‌కతా ఎయిర్పోర్ట్
-
దేశమంతా బెంగాల్‌కు అండగా ఉంది: ప్రధాని
ఢిల్లీ : తీవ్ర ఉగ్రరూపం దాల్చిన పెను తపాన్ ‘ఉంపన్’ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్ దాటికి అనేక ఇళ్లు నేలకొరిగాయి. భారీ వర్షాలు, తీవ్రమైన గాలుల కారణంగా సమాచార వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. ఈ తుపాన్ తీవ్రంగా మారటంతో పశ్చిమబెంగాల్లో 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెను తుపాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశమంతా పశ్చిమబెంగాల్ అండగా నిలుస్తుందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. పెను తుపాన్ ఉంపన్’ద్వారా నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు. (కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ) ‘ఉంపన్ తుపాన్ వల్ల సంభవించిన వినాశనాన్ని పశ్చిమ బెంగాల్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. ఈ కష్ట సమయంలో దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’. అని ప్రధాని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. స్థానికంగా పరిస్థితిని ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నామని ప్రధాని తెలిపారు. (గులాబీ రంగులో ఆకాశం.. నా సిటీ పూర్వస్థితికి!) -
తుపాను : గులాబీ రంగులో ఆకాశం
అతి తీవ్ర రూపం దాల్చిన తుపాను ‘ఉంపన్’ పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం కాగా.. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ సైతం ధ్వంసమైంది. సూపర్ సైక్లోన్ ధాటికి పశ్చిమ బెంగాల్లో 12 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. అయితే ఉంపన్ తీవ్రత నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు జాగ్రత్తల చర్యల కారణంగా.. ప్రాణనష్టం తగ్గినా.. ఆస్తినష్టం భారీగానే సంభవించింది. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఈ నేపథ్యంలో తుపాన్ ధాటికి అల్లాడిన ఒడిశా కాస్త తేరుకుందంటూ స్థానికులు ట్విటర్లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. వాటిని తట్టుకుని నిలుస్తుందనడానికి నా పట్టణం మరోసారి మంచి ఉదాహరణగా నిలిచింది. తుఫాన్ ఉంఫన్ శాశ్వతంగా వెళ్లిపోయింది. భువనేశ్వర్ పరిసరాల్లో ఆకాశం ఇలా’’అని గులాబీ రంగులో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించే ఆకాశం ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుఫాన్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ.. వారు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. My city is an example that we bloom with grace no matter how stormy the times be. 🙂 The evening sky! ❤#Bhubaneswar #Amphan @BBSRBuzz pic.twitter.com/uFq5xAqSuj — Naimisha (@SpeakNaimisha) May 20, 2020 -
ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేటలో వెండి నాణేలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్ర ఉంపన్ తుపాన్ కారణంగా సముద్రంలోని అలల తాకిడికి కోనపాపపేట తీరంలో పలు ఇళ్లు నేల కూలిపోయాయి. అయితే ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు బుధవారం రాత్రి నుంచి తీరంలో వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం వారు చాలా ధనవంతులని, ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టి ఉన్నారేమో అని ప్రచారం కొనసాగుతోంది. బయటపడ్డ ఈ వెండి నాణేల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఉంపన్’ తీరం దాటిన విషయం తెలిసిందే. -
కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ
కోల్‌కతా: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్’ వల్ల పశ్చిమ బెంగాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ తుపాన్ తీవ్రంగా మారటంతో 12 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉంపన్ తుపాన్ ప్రభావం కరోనా వైరస్ కంటే తీవ్రంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ తుపాన్‌ను ఘోర విపత్తుగా ఆమె పేర్కొన్నారు. తుపాన్ తీవ్రతను ఆమె కంట్రోల్ రూం ద్వారా బుధవారం పర్యవేక్షించారు. తుపాన్ భారీ వర్షం, తీవ్రమైన గాలితో విలయతాండవం సృష్టించిందని ఆమె చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి తీవ్ర తుపాన్ సంభవించిందని ఆమె అన్నారు. ‘నేను వార్ రూమ్‌లో కూర్చు న్న సమయంలో నా కార్యాలయంపై తుపాన్ ప్రభావం తీవ్రంగా పడింది’ అని సీఎం మమాతా బెనర్జీ తెలిపారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం) ఈ తుపాన్ వల్ల సముద్ర తీర ప్రాంత ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ఇళ్లు కూలిపోయి, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు పడిపోవటంతో కరెంట్ నిలిచిపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తుపాన్ వల్ల 125 కిలో మీటర్ల వేగంతో గాలి వీచటంతో ప్రజలు భయభ్రాతులకు గురయ్యారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తుపాన్ ప్రభావంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. లాక్డౌన్ కారణంగా మూసివేసిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వర్షపు వరద నీరు చేరింది. ఇక బెంగాల్‌లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్ తీరం దాటిన విషయం తెలిసిందే. (శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడి దారుణ హత్య) -
ఉంఫాన్ తుఫాను బీభత్సం
-
బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్’ పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది. పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్ తీరం దాటింది. ఆ సమయంలో తీరం వెంబడి బీభత్సం సృష్టించింది. (తగ్గుతున్న వెరీయాక్టివ్ క్లస్టర్లు) గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ ధ్వంసమయింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. తీరం దాటే సమయంలో తీరంలో అలలు భారీగా ఎగసిపడ్డాయి. కోల్‌కతాలో లోతట్టు ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ఒడిశాలో పురి, ఖుర్ద, జగత్సింగ్పుర్, కటక్, కేంద్రపార, జాజ్‌పుర్, గంజాం, భద్రక్, బాలాసోర్‌ల్లో మంగళవారం నుంచి భారీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం ప్రారంభమవడానికి ముందే రెండు రాష్ట్రాల్లో 6.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలి తమపై పడిన వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్లోని హౌరా, నార్త్ 24 పరగణ జిల్లాల్లో ముగ్గురు చనిపోయారు. జాతీయ విపత్తు స్పందన దళాలు రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ బుధవారం తెలిపారు. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమబెంగాల్లో 19 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 5 లక్షల మందిని, ఒడిశాలో 1.58 లక్షల మందిని సహాయ కేంద్రాలకు చేర్చామన్నారు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ జిల్లాలు, తూర్పు మిద్నాపూర్ జిలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు, మౌలిక వసతులకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ తుపాను కారణంగా అస్సాం, మేఘాలయాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడినప్పటి నుంచి, తుపాను దిశ, తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలన్నీ 100% కచ్చితత్వంతో వాస్తవమయ్యాయన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సమర్ధంగా వ్యూహాలు రూపొందించుకోగలిగిందన్నారు. బంగ్లాదేశ్‌లో... ఉంపన్ బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. పెను గాలులు, భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిచిపోయింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో బోటు బోల్తా పడటంతో వాలంటీరు చనిపోయారు. పలు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర హెచ్చరిక స్థాయిని అధికారులు ప్రకటించారు. 20 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించామని, ఆర్మీని రంగంలోకి దింపామని ప్రధాని షేక్ హసీనా చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బెంగాల్ తీరాన్ని తాకిన పెనుతుపాను
న్యూఢిల్లీ: ఉంపన్ తుపాను బుధవారం మధ్యాహ్నం భీకర గాలులతో పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకింది. సాగర్ ఐల్యాండ్స్‌కు 35 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బెంగాల్ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో తుపాను నాలుగు గంటల పాటు తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. దిఘా ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందిపూర్‌లో పెనుగాలులతో వర్షాలు బీభత్సతం సృష్టించాయి. కాగా, మధ్యాహ్నం 3:30-5:30 గంటల సమయంలో ఉంపన్ తుపాను తీరం దాటిందని ఐఎండీ సాయంత్రం ప్రకటించింది. ఉంపన్ తుపాను నేపథ్యంలో పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. తుపాను సహాయక చర్యల కోసం 41 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. పశ్చిమబెంగాల్లో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఒడిశాలో లక్షన్నర మందిని తరలించినట్టు చెప్పారు. ఉంపన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై రేపటికి తగ్గిపోతుందని ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా ‘సాక్షి’ టీవీతో చెప్పారు. ఎల్లుండి నుంచి ఉంపన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?) -
ఉంపన్ పెనుతుపాన్: తాజా అప్డేట్
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉంపన్ పెనుతుపాన్ కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. పారాదీప్‌కు తూర్పు ఈశాన్యదిశగా 140 కిలోమీటర్ల దూరంలో, సాగర్‌ఐల్యాండ్‌కు దక్షిణదిశగా 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు పేర్కొంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సాయంత్రంలోగా దిఘా(పశ్చిమ బెంగాల్)-హతియా దీవుల(బంగ్లాదేశ్) మధ్య సుందర్బన్స్కు సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?) తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు.. తీరంవెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, అంఫన్ పెనుతుపాన్ ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. (తుపాను ఎఫెక్ట్; ముందుకొచ్చిన సముద్రం) ఫోటోగ్యాలరీ: తీరంలో అల్లకల్లోలం -
‘అందరికీ ఇళ్ల పథకంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి: అంఫన్ తుపాన్ వల్ల సముద్రంలో ఎగిసిపడిన అలల తీవ్రతకు నేలకొరిగి ఇళ్లకు ‘అందరికి ఇళ్లు’ పథకంలో కొత్త ఇళ్లని నిర్మిస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఆయన బుధవారం తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సూరడాపేట, మాయపట్నం,ఉప్పాడలో కోతకు గురైన ప్రాంతాలను కాకినాడ ఆర్డివో చిన్నకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగు నీరు సదుపాయం అందిస్తున్నామని తెలిపారు. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?) ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో దివంగత నేత వైఎస్సార్ జియా ట్యూబ్‌ను నిర్మించారని ఆయన గుర్తు చేశారు. కానీ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘జియో ట్యూబ్’ పూర్తిగా శిధిలమైందన్నారు. జియో ట్యూబ్‌తో పాటుగా తుఫాన్‌కు దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ రాక్ వాల్ విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. -
తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?
‘అంఫన్’ తుపాను.. ప్రస్తుతం విరుచుకుపడుతోంది. ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. అసలు తుపానులకు పేర్లు ఎవరు.. ఎందుకు.. ఎలా పెడతారో తెలుసుకుందామా..? (అల్ల కల్లోలంగా ఉప్పాడ తీరం) సాక్షి, విశాఖటప్నం: హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్ పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రంలో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్థాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా ఒడిశా, పశ్చిమ బంగాలను భయపెడుతున్న తుపానుకు అంఫన్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. అంఫన్ అంటే థాయిలాండ్ భాషలో ఆకాశం అని అర్థం. ప్రస్తుత జాబితాలో చివరి పేరు అంఫన్.. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆ్రస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ (పశ్చిమ ఇండీస్) దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెపె్టంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. ఎవరైనా సరే తుపాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదిస్తే ఆ పేరు భారత తరపున జాబితాలో చేరుతుంది. (కృష్ణా జలాల వినియోగంలో రికార్డు) 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ దేశాలు 169 పేర్లు సూచించాయి. తర్వాత వచ్చే తుపానులకు నిసర్గా (బంగ్లాదేశ్), గతి(భారత్), నివార్ (ఇరాన్), బురేవి (మాల్దీవులు), తౌక్టే (మయన్మార్), యాస్ (ఒమన్) పిలుస్తారు. భారతదేశం గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్ల సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు. -
తీరంలో అంఫన్ అల్లకల్లోలం
-
అల్ల కల్లోలంగా ఉప్పాడ తీరం
సాక్షి, కాకినాడ: ‘అంఫన్’ తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్ల కల్లోలంగా మారింది. తీరం వెంబడి కెరటాలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలు ఎగసిపడడంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మాయపట్నం వద్ద జియా ట్యూబ్ దాటుకుని ఇళ్ళల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. (‘అంఫన్’ ఎఫెక్ట్; ఎగసిపడుతున్న సముద్ర అలలు) కాకినాడలోని సూరడపేట, మాయపట్నంలో కూడా సముద్రం కల్లోలంగా మారింది. జియో ట్యూబ్ దాటి ఊరిలోకి కెరటాలు ఎగసిపడుతున్నాయి. కెరటాల దాటికి జియో ట్యూబ్ రాళ్లు ఊళ్ళో వచ్చి పడుతున్నాయి. పూరి గుడిసెళ్ళోకి సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా, అంఫన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. -
నేడు తీరం దాటనున్న ఉంపన్
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. సహాయక చర్యలు పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 41 బృందాలను మోహరించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందిని తుపాను సహాయ కేంద్రాలకు తరలించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. గత సంవత్సరం ఫని, బుల్బుల్ తుపానులను ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందని విపత్తు నిర్వహణ మంత్రి జావేద్ పేర్కొన్నారు. ఒడిశాలో.. తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లోని 11 లక్షల మందిని తరలించే కార్యక్రమం ప్రారంభించామని ఒడిశా అధికారులు తెలిపారు. ప్రభావిత జిల్లాలో విపత్తు నిర్వహణ దళాలు సహాయ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్రపార, బాలాసోర్ తదితర తీర ప్రాంత జిల్లాల్లో పెనుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఉంపన్ తుపాను సహాయ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ సీఎం మమత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో వేర్వేరుగా సమీక్షించారు. అత్యంత తీవ్ర(ఎక్స్ట్రీమ్లీ సివియర్) తుపాను నుంచి సోమవారం ప్రచండ తుపాను(సూపర్ సైక్లోన్)గా ఉంపన్ పరిణమించింది. మంగళవారం బలహీనపడి అత్యంత తీవ్ర తుపానుగా మారింది. -
‘అంఫన్’ ఎఫెక్ట్; ముందుకొచ్చిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: సూపర్ సైక్లోన్ తీవ్రత తగ్గి పెనుతుపానుగా ‘అంఫన్’ మారినట్టు వాతావరణ కేంద్రం మంగళవారం సాయంత్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుపాను పయనిస్తున్నట్టు వెల్లడించింది. పారాదీప్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో పెనుతుపాను కేంద్రీకృతం అయినట్టు పేర్కొంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం దిఘా(పశ్చిమ బెంగాల్)-హతియా దీవుల(బంగ్లాదేశ్) మధ్య సుందర్బన్స్కు సమీపంలో పెనుతుపాను తీరం దాటనుంది. తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరంవెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్ని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. (భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!) అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అవంతి అంఫన్ పెనుతుపాను ప్రభావంతో విశాఖ జిల్లా మంగమారిపేటలో తీరం వెంబడి సముద్రపు అలలు ముందుకు వచ్చాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ మంగళవారం మంగమారిపేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీరం దాటే సమయంలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలలు, బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని మత్స్యకారులకు సలహాయిచ్చారు. అంఫన్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్లు ముందుకొచ్చింది. రాజోలు నియోజకవర్గం అంతటా ఈదురుగాలులు వీస్తున్నాయి. మంత్రి ధర్మాన సమీక్ష అంఫన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం శ్రీకాకుళంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున విపత్తుల నిర్వహణ శాఖ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి రంపాలు సిద్దం చేయాలని సూచించారు. నదుల్లోకి వచ్చే వరద ప్రవాహంపై పొరుగునున్న ఒడిశా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లలకు తీవ్ర నష్టం వాటిల్లే సూచనలు ఉన్నందున అవసరమైన సామాగ్రి అందుబాటులో సిద్దం చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు అంఫన్ తుపాను ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈదురుగాలులుతో కూడిన వర్షం పడింది. ఒడిస్సా పూరీ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ఉధృతికి జగన్నాథస్వామి దేవాలయ శిఖరంపై ఉన్న భారీ పతాకం ధ్వంసమయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్‌కతా నగరాల్లో వర్షాలు పడుతున్నాయి. అంఫన్ పెనుతుపాను ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (అంఫన్ బీభత్సం మామూలుగా ఉండదు!) -
భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!
న్యూఢిల్లీ: ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్ మత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఇది ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘అంఫన్’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని మత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాం కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ అన్నారు. అంఫన్ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో తమ బృందాలను బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 19, ఒడిశాలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించినట్టు వెల్లడించారు. అదనంగా మరో 6 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి బెటాలియన్‌లో నాలుగు బృందాలు ఉంటాయని చెప్పారు. (అంఫన్ బీభత్సం మామూలుగా ఉండదు!) జనరేటర్లు సిద్ధం చేసుకోండి అంఫన్ తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని టెలికం సర్వీసు ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ సూచించారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున తగినంత సంఖ్యలో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేసుకుని, సరిపడా డీజిల్‌తో సన్నద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ జనరేటర్ల సహాయంతో టెలికం టవర్లను పనిచేయించవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంఎంఎస్‌ల ద్వారా సమాచారం చేరవేయనున్నట్టు తెలిపారు. స్థానిక భాషల్లో, ఉచితంగా ఈ సేవలు అందిస్తామన్నారు. తుపాను తీరం దాటేవరకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. (అంఫన్‌తో జాగ్రత్త) -
ఆ జిల్లాల్లో అంఫన్ విశ్వరూపం
భువనేశ్వర్: మరింత తీవ్ర రూపం దాల్చిన అంఫన్ తుపాను రేపు(బుధవారం) తీరం దాటనుందని వాతావరణ శాఖ ఇదివరకే వెల్లడించింది. దిఘా (పశ్చిమ బెంగాల్), హతియా దీవులు (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటే సమయంలో 155 నుంచి 165 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని తెలిపింది. అంఫన్ తుపాను వల్ల ఒడిశాలోని ఆరు జిల్లాలు తీవ్ర ప్రభావితం కానున్నాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది. తీరం దాటిన వెంటనే కేంద్రపారా, భద్రక్, మయూర్భంజ్, జైపూర్, జగత్సింగ్పూర్ జిల్లాల్లో తుపాను బీభత్సం అధికంగా ఉంటుందని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపాడు. (డిఘ-హతియా వద్ద తీరం దాటనున్న అంఫాన్) కాగా నేడు సాయంత్రం నుంచే ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్సింగ్ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీస్తూ అంఫన్ ప్రభావాన్ని చూపుతోంది. 'అంఫన్' తుపాను ప్రభావం అధికంగా ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్‌పైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని లక్షలాది తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 520 కిలో మీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడటం రెండోసారి కావడం గమనార్హం. (అతి తీవ్ర తుపానుగా అంఫన్) -
తాటి, కొబ్బరి చెట్లు కూలిపోతాయి!
సాక్షి, హైదరాబాద్: సూపర్ సైక్లోన్ 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న 'అంఫన్' తుపాను బుధవారం మధ్యాహ్నం దిఘా (పశ్చిమ బెంగాల్) మరియు హతియా దీవులు (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 155 నుంచి165 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గరిష్టంగా 185 కిలోమీటర్ల వరకు భీకర గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ సమయంలో 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూరి పాకలు, పురాతన నిర్మాణాలతో పాటు ఎగిరే వస్తువులకు ప్రమాదం ఉందని పేర్కొంది. కమ్యూనికేషన్, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయని తెలిపింది. అనేక చోట్ల రైలు, రహదారి ప్రయాణాలకు అంతరాయం కలుగుతుందని అంచనా వేసింది. నిలబడి ఉన్న పంటలు, తోటలకు విస్తృతమైన నష్టం వాటిల్లుతుందని తెలిపింది. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కువగా కూలిపోయే అవకాశముందని..పెద్ద పడవలు, ఓడలు ధ్వంసం కావొచ్చని ఐఎండీ హెచ్చరించింది. 'అంఫన్' ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా ఈదురు గాలులు వీచే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. (అంఫన్‌తో జాగ్రత్త) బెంగాల్, ఒడిశా అప్రమత్తం 'అంఫన్' అతి తీవ్ర తుపానుగా మారడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలపై 'అంఫన్' ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) 37 బృందాలను బెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంతాలకు తరలించింది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడటం రెండోసారి కావడం గమనార్హం. (అతి తీవ్ర తుపానుగా అంఫన్) -
రేపు తీరం దాటనున్న ‘అంఫాన్’
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా సూపర్ సైక్లోన్ 'అంఫాన్' కొనసాగుతోంది. ఈ తుపాన్ పారాదీప్‌కు దక్షిణంగా 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ రేపు(బుధవారం) సుందర్బన్స్కు సమీపంలో అంఫాన్ అతి తీవ్ర తుపానుగా మారనుంది. డిఘ-హతియా తీరం వద్ద ‘అంఫాన్’ తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. (అంఫన్‌తో జాగ్రత్త) తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం పోర్టుల్లో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
అంఫన్‌తో జాగ్రత్త
సాక్షి, కాకినాడ: అంఫన్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి సోమ వారం రాత్రి తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. తుని, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడలతో పాటు కోనసీమ ప్రాంతంలోని కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మలికిపురం, రాజోలు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ 24 గంటల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు నెల్లూరు లో వర్షాలు పడుతున్నాయన్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతుందని, ఈ నెల 20, 22 తేదీల మ«ధ్య ఒడిశా, భువనేశ్వర్ తీరంవైపు కదులు తూ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్టు తు పాను హెచ్చరిక కేంద్రం ప్రకటించడంతో అధికారు లు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో బుధవారం ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నట్టు తెలిపారు. సముద్రం తీరానికి పర్యాటకులను అనుమతించ వద్దని, ఎవరైనా వస్తే వారిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. తుపాను సమయంలో వినియోగించే వివిధ పరికరాల పని తీరును పరిశీలించి తదనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలని మండల పరిధిలోని అధికారులను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. రాజోలు దీవిలో ‘అల’జడి 30 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం మలికిపురం: అంఫన్ తుపాను ప్రభావం రాజోలు దీవి సముద్ర తీరంలో తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా సముద్రపు అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సుమారు 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. రాజోలు దీవిలో సముద్ర తీరం వెంబడి భారీగా అలలు భూభాగం వైపు చొచ్చుకుని వచ్చాయి. భూభాగం కూడా కొట్టుకుపోతోంది. మలికిపురం ఎస్సై ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సముద్ర తీరం వద్ద బందోబస్తు నిర్వహించి ప్రజలు అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. -
అతి తీవ్ర తుపానుగా అంఫన్
మహారాణి పేట (విశాఖదక్షిణ)/ భువనేశ్వర్: అంఫన్ తుపాను సోమవా రం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది బంగాళాఖాతంలో ఈశాన్యం వైపు పయనించి ఈ నెల 20న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరాన్ని తా కనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంఫన్ ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది ఉత్తర–ఈశాన్యం వైపు పయనించి మరింత తీవ్రంగా దిఘా(ప.బెంగాల్), హటియా దీవి(బంగ్లాదేశ్)ల మధ్య పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 265 కిలోమీటర్ల వేగంగా గాలులు వీయొచ్చు. సోమవారం సాయంత్రం నుంచి ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్సింగ్ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఒడిశా తీరప్రాంత 12 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్‌కు ‘ఆరెంజ్’హెచ్చరికలను జారీ చేసింది. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం లేదా సాయంత్రం అంఫన్ తీరాన్ని దాటే సమయంలో గాలి తీవ్రత 165 కి.మీ.లు ఉండొచ్చు. ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష ‘అంఫన్’తో ఉత్పన్నమైన పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరి రక్షణకూ చర్యలు తీసుకుంటామనీ, ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత మేర కేంద్రం సాయం అందజేస్తుందని తెలిపారు.