బెంగాల్‌కు వెయ్యి కోట్ల తక్షణ సాయం  | Cyclone Amphan: Modi Announced Rs 1000 Crores Interim Relief For Bengal | Sakshi
Sakshi News home page

తక్షణ సహాయం ప్రకటించిన ప్రధానమంత్రి

Published Fri, May 22 2020 2:00 PM | Last Updated on Fri, May 22 2020 2:49 PM

Cyclone Amphan: Modi Announced Rs 1000 Crores Interim Relief For Bengal - Sakshi

కోల్‌కతా : ఉంపన్‌ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు రూ. వెయ్యి కోట్ల తక్షణ ఆర్ధిక సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తుపాను ధాటికి బెంగాల్‌లో ఇప్పటివరకు 80 మందికిపై మృత్యువాత పడగా, వేల ఎకరాల్లో పంట నష్టం, వంతెనలు కూలిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాను బీభత్స దృశ్యాలు ప్రత్యక్షంగా చూశానని, ఈ కష్ట సమయంలో బెంగాల్‌ను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు మోదీ తెలిపారు. 

కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీ వదిలి బయటకి రాలేదు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత ఉంపన్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే కోసం బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని తొలి పర్యటన ఇదే కావడం విశేషం. 

చదవండి:
ఉంపన్‌.. కోల్‌కతా వణికెన్‌
మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను: గంగూలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement