ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్‌డౌన్ ప్రస్తుతం ఉంఫన్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో జూన్ 30 వరకు యదావిధిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎనిమిది జిల్లాల్లో ఉంఫన్ తుఫాను కారణంగా అనేక పాఠశాల భవనాలు దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. అయితే 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని గతవారం ప్రకటించినట్లే జూన్ 29 నుంచే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. (స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు)
దాదాపు 1,058 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే తుఫాను కారణంగా 462 పరీక్షా కేంద్రాలు దెబ్బతిన్నాయని అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొన్ని పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. అవసరమైతే మరికొన్ని కాలేజీ భవనాలను కూడా ఎగ్జామ్ సెంటర్లుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. మిడ్నాపూర్, బుర్ద్వాన్, నాడియా, హూగ్లీ, హౌరా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఉంఫన్ కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. దాదాపు తుఫాను కారణంగా స్కూళ్లు, పాఠశాలలు దెబ్బతిని 700 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని పార్థా ఛటర్జీ వెల్లడించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. (సరిహద్దులో ఉద్రిక్తత: రంగంలోకి మళ్లీ అదే టీం?! )
Comments
Please login to add a commentAdd a comment