న్యూ ఢిల్లీ : ఉగ్ర రూపంతో విరుచుకుపడుతున్న ఉంపన్ తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము కూడా ఎప్పటికప్పుడు అంఫన్ తుపాను బీభత్సంపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తుపాను బాధిత రాష్ట్రాలైనా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రతి పౌరుడిని ఆదుకునే బాధ్యత తమ మీద ఉందన్నారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. (నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు)
అదే సమయంలో ఎవరూ నివాసాల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ తుపాను విలయతాండవం వల్ల స్థంభించిపోయిన వ్యవస్థల పునరుద్ధరణ పనులు చేపట్టడం నిజంగా కష్టతరమేనని ఎన్టీఆర్ఎఫ్ డైరెక్ట్ జనరల్ ఎన్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ తుపాను వల్ల భారీ ఆస్థి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్‌పోర్టు నీట మునిగిపోగా దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రజలను గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. (బెంగాల్ తీరాన్ని తాకిన పెనుతుపాను)
Comments
Please login to add a commentAdd a comment