ఒడిశాలోని బాలాసోర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడ ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని, వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పలు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పలువురు అనాథలుగా మారారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుమారుని మృతదేహం తీసుకువచ్చేందుకు ఒడిశా వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుమారుని మృతదేహం మాయమయ్యిందని ఆరోపిస్తున్నాడు.
తన కుమారుని మృతదేహాన్ని ఎవరో తమవారిదేనని చెప్పడంతో అధికారులు ఆ మృతదేహాన్ని బీహార్ తరలించారన్నారు. శివనాథ్ కుమారుడు విపుల్ రాయ్ ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో 288 మంది మృత్యువాతపడగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శివనాథ్ మాట్లాడుతూ తన కుమారుడు పశ్చిమ బెంగాల్‌లోని తమ ఇంటికి వస్తుండగా, ఈ రైలు ప్రమాదంలో బలయ్యాడని తెలిపారు.
ప్రయాణ సమయంలో తన కుమారుడు తల్లితో.. కొద్దిసేపట్లో హౌరా వస్తున్నానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు అతను తరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్నారు. టీవీలో కుమారుని మృతదేహాన్ని గుర్తించి, దానిని తీసుకువెళ్లేందుకు భువనేశ్వర్ వచ్చానని తెలిపారు. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో తన కుమారుని మృతదేహం ఉందని తెలిసి అక్కడకు వెళ్లగా, అక్కడి హెల్ప్ డెస్క్ బృందం తన కుమారుని మృతదేహం వేరెవరో తమవారిదేనని చెప్పడంతో వారితో పాటు బీహార్ పంపించామన్నారు.
తన పరిస్థితి గురించి అధికారులకు చెప్పగా ఆ మృతదేహానికి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించి, ఎవరిదో తెలుసుకుని రిపోర్టు అందజేస్తామని, దీనికి ఏడు రోజులు పడుతుందని తెలిపారన్నారు. తాను టీవీలో కుమారుని మృతదేహం చూడగానే వెంటనే ఇక్కడకు వచ్చానని, ఇంతలోనే మృతదేహం ఇలా మాయం అవుతుందని అనుకోలేదన్నారు.
చదవండి: బాడీ నంబరు 151, 156, 174..
Comments
Please login to add a commentAdd a comment