పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగిలు | Secunderabad Shalimar Superfast Express Derail Near Howrah no casualties | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగిలు

Published Sat, Nov 9 2024 9:50 AM | Last Updated on Sat, Nov 9 2024 10:44 AM

Secunderabad Shalimar Superfast Express Derail Near Howrah no casualties

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగిలు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని  నల్‌పూర్‌ వద్ద ఈ ఘటన జరిగింది.  అయితే.. ఈ ఘనటలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

‘‘శనివారం ఉదయం 5.31 గంటలకు ఖరగ్‌పూర్ డివిజన్‌లోని నల్పూర్ స్టేషన్ గుండా వెళుతుండగా 22850 సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పార్శిల్ వ్యాన్, రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు’’ అని సౌత్ ఈస్టర్న్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

రైలు మధ్య నుంచి బయటి పట్టాలపైకి మారుతున్న సమయంలో పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్ నుంచి వైద్య సహాయం కోసం సహాయ రైళ్లు  ఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారుల తెలిపారు.

చదవండి: మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement