లోక్‌సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు తిప్పేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది.
ఇందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 40 మంది స్టార్‌క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వారిలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు ఈ జాబితాలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన లేఖలో పేర్కొంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఒడియా నటులు అనుభవ్ మొహంతి, శ్రీతమ్ దాస్, హరిహర్ మహపాత్ర, పింకీ ప్రధాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment