పెరుగుతున్న చలి | Gradually increasing the intensity of winter | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న చలి

Published Wed, Oct 29 2014 3:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

పెరుగుతున్న చలి - Sakshi

పెరుగుతున్న చలి

తాండూరు: కొద్ది రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇటీవల తుపాను నేపథ్యంలో  మరింత ఎక్కువైంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో ‘చలిపులి’ విజృంభిస్తోంది. దీంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం వేళలో చలిగాలులతోపాటు మంచు ప్రభావం కూడా కనిపిస్తోంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉన్నప్పటికీ ఐదురోజులుగా రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 16.5 డిగ్రీలు నమోదైంది. ఈ నెల 24వ తేదీన గరిష్టం 32.5, కనిష్టం 17.9, 25న 25.3- 21.8, 26న 22.5-19, 27న 25.2-19.2, మంగళవారం గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 16.5 డిగ్రీలు నమోదయ్యా యని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు. ఐదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం వల్లే చలి పెరిగిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement