విశాఖపట్నం: వాయుగుండం తుఫానుగా మారనుందని విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరించింది. చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా నైరుతి బంగాళఖాతంలో అది కేంద్రీకృతం కానున్నట్లు వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా పయనం అయ్యి అనంతరం దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్నట్లు తెలిపింది. రాగల 24గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఉదయం నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాలో మాత్రం ఓ మోస్తరుగా పడతాయి. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు రానున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు.
తుఫాన్గా మారనున్న వాయుగుండం
Published Tue, May 17 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement