శివమొగ్గ: ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శి్చమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి.
ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment