సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి అర్ధరాత్రికల్లా తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అనంతరం గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ ఈనెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది.
ఆ తర్వాత దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీ నపడుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభా వంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలిక పాటి, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు గుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవు తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.3డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment