Eunice Storm London: Watch The Video Of Pilots Making Risky Landing At London - Sakshi
Sakshi News home page

Viral Video: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో

Published Sat, Feb 19 2022 8:02 PM | Last Updated on Sun, Feb 20 2022 9:35 AM

As Storm Eunice Whips Pilots Making Rsky Landings At London - Sakshi

Thousands tune in to watch pilots land in London: యూనిస్‌ తుపాను లండన్‌ నగరాన్ని వణికిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ భీకర గాలులు కారణంగా  రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లండన్‌ వీచిన గాలలుకి ఒక విమానం విమానశ్రయంలో ల్యాండింగ్‌ అయిన విధానం చూస్తే కచ్చితంగా భయమేస్తుంది. ఆ ఈదురుగాలులకి విమానం ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్లుతున్న వాహనాలను ఢీ కొడుతుందేమో అనే సందేహం కలుగుతుంది.

ఆ విమానంలో ప్రయాణికలు సైతం భయంతో ఊపిరి బిగబిట్టుకుని చూస్తున్నారు. అంత భయంకరంగా ఆ విమానం రన్ వే పై ల్యాండ్ అయ్యింది. అయితే పైలెట్‌ చాకచక్యంగా ఆ విమానాన్ని చివరికి సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వొళ్లు గగ్గుర్పాటుకు గురిచేసిన ఈ వీడియోనీ మీరు ఒకసారి వీక్షించండి.

(చదవండి: బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement