పరిశోధకుల నౌకను ఢీ కొడుతున్న రాకాసి అల
వెల్లింగ్‌టన్, న్యూజిలాండ్ : దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన రాకాసి అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు వెల్లడించారు. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
2012లో కూడా ఇదే ప్రాంతంలో 22.03 మీటర్ల ఎత్తుగల భారీ అల సంభవించింది. వీటికంటే అతి భారీ అలలు సంభవిస్తాయని భావిస్తున్నట్లు వివరించారు. కాగా, ఇప్పటివరకూ భూమి మీద అతిపెద్ద రాకాసి అల అలస్కా తీరంలోని లితుయా అగాథం వద్ద సంభవించింది. 1958లో సంభవించిన ఓ భారీ భూకంపం కారణంగా ఇక్కడ అలలు 30.5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment