
లూయిస్‌విల్లే: అమెరికాను భారీ తుపాను వణికించింది. ఆ తుపాను ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 3 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను ఉత్తర కరోలినాలో భారీ ప్రభావం చూపింది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలు, వరదలు, వర్షం కారణంగా అయిదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ వర్జీనియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా చోట్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, జార్జియాల్లో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. వాయు తీవ్రతకు చాలా చోట్ల చెట్లు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని తుపాను ప్రభావిత ప్రాంతాలోని ప్రజలను టెన్నెసీ లోయ ప్రాధికార సంస్థ కోరింది. మరోవైపు మంచు భారీగా కురుస్తుండటంతో అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..)
Comments
Please login to add a commentAdd a comment