
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్‌లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్‌ని వణికించేలా వర్షాలు పడ్డాయి.
ఒక్కసారిగా దుబాయ్‌లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు.
దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్‌ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు.
Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO
— Pagan 🚩 (@paganhindu) April 17, 2024
(చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!)