టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డైరెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ రాజీనామా చేశాడు. దేశంలో రాజకీయ మార్పుల కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీబీ ప్రెసిడెంట్ పదవి నుంచి నజ్ముల్ హసన్ సైతం వైదొలిగాడు. అతడి స్ధానంలో మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఖలీద్ వంతు వచ్చింది.
కాగా 2013లో గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను ఓడించి తొలిసారిగా డైరెక్టర్‌గా ఎన్నికైన మహమూద్.. వరుసగా మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. తన పదవీకాలంలో బంగ్లా క్రికెట్ అభివృద్దికి మహమూద్ ఎంతగానో కృషి చేశాడు. చాలా ఏళ్ల పాటు బీసీబీ గేమ్ డెవలప్‌మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశాడు.
యువ క్రికెటర్లను తయారు చేయడంలో అతడిది కీలక పాత్ర. ఖలీద్ హయాంలోనే యువ బంగ్లా జట్టు 2020లో భారత్‌ను ఓడించి అండర్19 ప్రపంచ కప్ గెలుచుకుంది. కాగా నజ్ముల్ హసన్, ఖలీద్ బాటలోనే మరికొందరు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.
బోర్డు డైరెక్టర్లు షఫియుల్ ఆలం చౌదరి, నైమూర్ రెహమాన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత్-బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment