ఆసియా కప్-2022 కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ కొనసాగనున్నాడు.ఇక జింబాబ్వే సిరీస్‌లో గాయపడిన వికెట్ నూరల్ హసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఇక అదే సిరీస్‌లో గాయపడిన మరో వికెట్ కీపర్ లిటన్ దాస్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. కాగా ఆసియా కప్‌కు జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగస్టు 8న ప్రకటించాల్సి ఉండగా.. షకీబ్ స్పాన్సర్‌షిప్ వివాదం వల్ల ఆలస్యమైంది. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది.
2012, 2016, 2018లో ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయింది. కాగా ఆసియకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరనగుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్,మెహిదీ హసన్ మిరాజ్,ఎబాడోత్ హుస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నూరుల్ హసన్ సోహన్, టాస్కిన్ అహ్మద్
చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్..
Comments
Please login to add a commentAdd a comment