ఢాకా: ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో క్రికెటర్లు తమ సమ్మెకు ముగింపు పలికారు. దీనిలో భాగంగా మాట్లాడిన బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హసన్.. క్రికెటర్లను డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగతా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని క్రికెటర్లతో జరిపిన చర్చల్లో ప్రస్తావించడంతో వార అందుకు అంగీకారం తెలిపారన్నాడు. ఫలితంగా క్రికెటర్ల సమ్మెలో కీలక పాత్ర పోషించిన షకిబుల్ హసన్‌కు డిమాండ్ల విషయంపై క్లారిటి ఇచ్చామన్నాడు. క్రికెటర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారన్నాడు. శనివారం నుంచి తమ జాతీయ క్రికెటర్లు యథావిధిగా మ్యాచ్‌లకు సిద్ధం కానున్నారన్నాడు.
దాంతో వచ్చే నెలలో భారత్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు, రెండు టెస్టుల సిరీస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. సొమవారం కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమంటూ బంగ్లా క్రికెటర్లు నిరసన బాట పట్టాడరు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించారు. దాంతో వెంటనే లాయర్ సమక్షంలో చర్చలు జరిపిన బీసీబీ.. దాదాపు అన్ని డిమాండ్లను నేరవేర్చడానికి ముందుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment