BCB
-
మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం!
ఆసియా కప్ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్ చేశారు. ''మే 28న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు బీసీబీ, ACB, లంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు. ఈ మీటింగ్‌లో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్‌ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్‌లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్ పాక్‌లో జరిగితే తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్‌లో ఆసియా కప్ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది. ఇక 2022లో టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్‌కప్ దృశ్యా ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. చదవండి: 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లా జట్టు ఇదే
టీమిండియతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. శనివారం(డిసెంబర్ 10న) మూడో వన్డే జరగనుండగా.. టీమిండియా మాత్రం విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇక బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) వన్డే సిరీస్ తర్వాత జరగనున్న టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టును నడిపించనుండగా.. సీనియర్ ప్లేయర్స్ ముష్పికర్ రహీమ్, తస్కిన్ అహ్మద్‌లు తుది జట్టులోకి తిరిగి వచ్చారు. గాయం కారణంగా తస్కిన్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ సమయానికి తస్కిన్ పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేడో తెలియకపోయినా అతన్ని ఎంపిక చేశారు. ఇక శనివారం మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకూ చట్టోగ్రామ్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్ మీర్పూర్లో జరగనుంది. తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబుల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ షాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరీ, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జాకిర్ హసన్, రెజావుర్ రెహమాన్, అనాముల్ హక్ బిజోయ్ The Bangladesh Cricket Board (BCB) announces the squad for the first Test against India starting at ZACS, Chattogram on 14 December 2022.#BCB | #Cricket | #BANvIND pic.twitter.com/inCCqvH0NM — Bangladesh Cricket (@BCBtigers) December 8, 2022 -
'బంగ్లాదేశ్ ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ ఆడే ఆలోచన లేదు'
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ జాతీయ జట్టుపై విమర్శలు గుప్పించాడు. తమ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ ఆడే ఆలోచన లేదని అతడు తెలిపాడు. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్.. ఘోర పరాభావం మూటకట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక మే 15 నుంచి శ్రీలంకతో స్వదేశంలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. టెస్టుల్లో మా జట్టు ఎందుకు ఇలా ఆడుతుందో నాకు ఆర్ధం కావడం లేదు. గత ఐదు టెస్టుల్లో ఇదే పరిస్ధితి కన్పిస్తోంది. సిరీస్ తొలి టెస్టులో జట్టు గట్టి పోటీ ఇస్తుంది. కానీ రెండో టెస్టులో చిత్తుగా ఓడి పోతున్నాం. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇలాగే జరిగింది. మా జట్టు ఆటగాళ్లు దీశీవాళీ టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనరు. అదే విధంగా వారికి టెస్టు క్రికెట్ ఆడే ఆలోచనే లేదు. ఇప్పుడు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాం. వారిని దేశవాళీ క్రికెట్ ఆడేలా చేయలేము. లేదంటే దేశీయ క్రికెట్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాలి" అని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్ అయినట్లుంది.. మొయిన్ అలీ ఫన్నీ కామెంట్ -
టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్
Mahmudullah Retires From Test Cricket.. బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు బుధవారం(నవంబర్ 24న) ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. మహ్మదుల్లా మాట్లాడుతూ.. '' టెస్టు క్రికెట్‌కు సరైన సమయంలోనే గుడ్‌బై చెబుతున్నా. నా నిర్ణయాన్ని జింబాబ్వే పర్యటన అనంతరమే ప్రకటించా. కానీ ఇంతకాలం ఆ విషయం దృవీకరించకుండా నేను టెస్టులు ఆడాలని భావించిన బీసీబీకి కృతజ్ఞతలు.12 ఏళ్ల టెస్టు కెరీర్లో బంగ్లాదేశ్‌కు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నేను టెస్టుల నుంచి మాత్రమే రిటైరవుతున్నా. టి20లు, వన్డేల్లో ఇంకా కొంతకాలం కొనసాగుతా. వైట్‌బాల్ క్రికెట్లో దేశానికి మరింతకాలం సేవ చేయాలని భావిస్తున్నా'' అంటూ ముగించాడు. ఇక 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2914 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 43 వికెట్లు తీశాడు. చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా వాస్తవానికి ఈ ఏడాది జింబాబ్వే పర్యటనలోనే మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై స్పందించాడు. ఇదే విషయాన్ని అప్పట్లో తన సహచరులతో పాటు బీసీబీకి ముందే వివరించాడు. టి20, వన్డేలపై దృష్టి పెట్టేందుకు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 150 పరుగులు నాటౌట్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడి బంగ్లాదేశ్‌కు 220 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో బంగ్లా బోర్డు మహ్మదుల్లా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా దృవీకరించలేదు. తాజాగా మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో బీసీబీ అంగీకరించింది. చదవండి: Mankading: 'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ -
మరణించిన క్రికెటర్‌కు ‘హ్యాపీ బర్త్‌డే‘ చెప్పిన బోర్డు!
ఢాకా: మంజరుల్ ఇస్లామ్ రానా.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్ 2007 లో మరణించాడు. 2003లో 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఇస్లామ్ రానా.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మైకేల్ వాన్‌ను మూడో బంతికే ఔట్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ తొలి ఓవర్లోనే వికెట్ తీయడం అదే మొదటిది. కానీ ఇస్లామ్ రానా 22ఏళ్ల 316 రోజులకే తుదిశ్వాస విడిచాడు. 2007 వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఇస్లామ్ రానా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ రోజు అతని జయంతి. కానీ అతనికి బర్త్ డే విషెస్ తెలుపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. ‘హ్యాపీ బర్త్‌డే ఇస్లామ్ రానా.. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన టెస్టు క్రికెటర్’ అని బీసీబీ ట్వీట్ చేసింది. అతని జయంతిని గుర్తుచేసుకునే క్రమంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో బీసీబీ తప్పులో కాలేసినట్లయ్యింది. దీనిపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైర్ వేశాడు. ‘స్టేహోమ్, స్టే సేఫ్, టేక్ యువర్ వ్యాక్సిన్’ అని కూడా చెప్పాల్సిందంటూ రిప్లై ఇచ్చాడు. ఇక్కడ చదవండి: IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ -
ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ
ఢాకా: కరోనాతో విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభించాలనుకున్న బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్‌కు మొండి చేయి ఎదురైంది. అతనితో పాటు మరికొంత మంది క్రికెటర్లు మిర్పూర్లోని షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొంటామని విజ్ఞప్తి చేయగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో ఈ సమయంలో బహిరంగ శిక్షణ మంచిది కాదంటూ వారి ప్రతిపాదనను తిరస్కరించింది. ‘ప్రాక్టీస్ చేసేందుకు ఇది తగిన సమయం కాదని మేం ముష్ఫికర్‌ను వారించాం. ట్రెయినింగ్ ముఖ్యమే కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అన్నింటికన్నా ప్రధానం. మిర్పూర్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాం. పూర్తి స్థాయిలో మైదాన పరిసరాలు సురక్షితం కాలేదు’ అని బీసీబీ స్పష్టం చేసింది. -
నేను వెళ్లనంటే వెళ్లను: ముష్ఫికర్
ఢాకా: పాకిస్తాన్లో పర్యటనకు సంబంధించి మరోసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చేసిన విజ్ఞప్తి చేసిన ముష్ఫికర్ రహీమ్ తోసిపుచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పర్యటనకు తాను వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాను పాకిస్తాన్లో పర్యటించే బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిని కాబోనంటూ స్పష్టం చేశాడు. పాకిస్తాన్ పర్యటనపై ముష్ఫికర్‌ను బీసీబీ సంప్రదించింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లననే గత నిర్ణయాన్ని ఒకవేళ మార్చుకుంటే మార్చుకోవచ్చని తెలిపింది. దీనిని ముష్ఫికర్ వినమ్రంగా తిరస్కరించాడు. ‘ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందులో వెనుకడగు వేసే ప్రసక్తే లేదు. నేను పాక్ పర్యటనకు వెళ్లనని ఇప్పటికే చెప్పా. దాన్ని బీసీబీ పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పాక్‌కు వెళ్లను. నాకు ఇదివరకే పీఎస్ఎల్ ఆఫర్ వచ్చింది. నా పేరు పీఎస్ఎల్లో ఉందా..లేదా అనేది సమస్య కాదు. పాకిస్తాన్‌తో టోర్నమెంట్లో భాగంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉండను. దీన్ని బోర్డు తప్పకుండా గౌరవించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం చాలా క్లియర్‌గా ఉంది. భవిష్యత్తులో కూడా నా నిర్ణయం మారదు. అక్కడకి వెళ్లే బంగ్లా క్రికెటర్లకు నా విషెస్ తెలియజేస్తున్నా’ అని ముష్ఫికర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ముష్ఫికర్ ‘డబుల్’ చరిత్ర) పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం ఏమీ ప్రమాదం కాదని చెప్పడం కోసమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షికి సిరీస్‌లో భాగంగా జనవరి 24వ తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకూ ఇరు జట్లు సిరీస్‌లు ఆడుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌తో పాటు, ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇక ఏకైక వన్డేతో పాటు మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉంది. ఈ ఫైనల్ ఫేజ్ సిరీస్‌లో ఏప్రిల్3వ తేదీన వన్డే మ్యాచ్ జరుగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్5వ తేదీ నుంచి కరాచీలో ఆరంభం కానుంది. దీనిపై ముష్పికర్‌ను బీసీబీ సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. -
మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఇప్పటికే సగం ఏర్పాట్లును పూర్తి చేసింది. ఇంకా షెడ్యూల్, ఆటగాళ్ల పూర్తి వివరాలను ఖరారు చేయాల్సి ఉండగా దానిపై తమ కార్యాచరణను ముమ్మరం చేసింది. మార్చి 18-22 మధ్యలో రెండు టీ20లను జరపాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కచ్చితంగా ఆసియా ఎలెవన్ జట్టులో ఉంచాలని బీసీబీ పట్టుదలతో ఉంది. (ఇక్కడ చదవండి: పాక్ వద్దు.. భారత్ ముద్దు) ‘మేము ఇంకా షెడ్యూల్, అందుబాటులో ఉండే ఆటగాళ్లపై కసరత్తులు చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీ)తో టచ్‌లో ఉన్నాం. భారత్ నుంచి ఏ ఆటగాళ్లు ఉంటారు అనే దానిపై వివరణ కోరాం. కాకపోతే కోహ్లి కచ్చితంగా ఉండాలని బీసీసీఐకి విజ్క్షప్తి చేశాం. దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. కోహ్లితో మాట్లాడిన తర్వాత మాకు సందేశం పంపొచ్చు. ఈ రెండు టీ20ల సిరీస్‌లో కోహ్లి ఉంటాడనే భావిస్తున్నాం’ బీసీబీ తెలిపింది.(ఇక్కడ చదవండి: ‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’) అయితే భారత్ నుంచి నాలుగు నుంచి ఐదుగురు ప్లేయర్లను ఆసియా ఎలెవన్ తరఫున ఆడటానికి పంపించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కాకపోతే ఆ క్రికెటర్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్నాడు. ఆదివారం జరుగనున్న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బంగ్లాదేశ్ అభ్యర్థనపై బీసీసీఐ చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కోహ్లితో ముందుగా చర్చించాలని బీసీసీఐ భావిస్తోంది. -
టీ20 సిరీస్ ఆడతాం.. టెస్టు సిరీస్ వద్దు!
ఢాకా: తమ దేశ పర్యటనలో టెస్టు సిరీస్ సైతం ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విన్నపాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిం ఖాన్ స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడటానికి బంగ్లాదేశ్ ఒప్పుకోలేదని తెలిపారు. వారు కేవలం టీ20 సిరీస్ ఆడటానికి మాత్రమే మొగ్గుచూపారని, టెస్టు సిరీస్ ఆడటానికి ముందుకు రాలేదన్నారు. అయితే తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించడానికి పీసీబీ సుముఖంగా లేదనే విషయాన్ని వాసిం ఖాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ దేశంలోని భద్రతాపరమైన ప్రణాళికల్ని ఇప్పటికే ఐసీసీ అంగీకరించిందని, దీన్ని తమ దేశానికి వచ్చే విదేశీ క్రికెట్ బోర్డులు దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. ముందుగా తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడటానికి బీసీబీ ఆమోదం తెలిపినా, ఆ తర్వాత అందుకు నిరాకరించడం బాధ కల్గించిందన్నాడు. బీసీబీతో ఇంకా చర్చలు జరుపుతున్నామన్నాడు. ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టుముందుగా వన్డే, టీ20 సిరీస్‌లను ఆడింది. సెప్టెంబర్-అక్టోబర్‌లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడిన శ్రీలంక.. మళ్లీ టెస్టు సిరీస్ ఆడటానికి పాకిస్తాన్లో అడుగుపెట్టింది. ఈ తరహాలో బంగ్లాదేశ్ కూడా అంగీకారం తెలుపుతుందనే ఆశాభావంతో పీసీబీ పెద్దలు ఉన్నారు. -
ఎవరిపైనా ఒత్తిడి లేదు.. అంతా మీ ఇష్టం!
డాకా: పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమని ఏ ఒక్క ఆటగాడ్నీ తాము బలవంతం చేయడం లేదని తాజాగా బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. పాకిస్తాన్ పర్యటనకు ఇష్టమైతేనే వెళ్లమంటూ ఆయన స్పష్టం చేశారు. ఇందులో కచ్చితంగా వెళ్లమని ఎవర్నీ బలవంతం చేయబోమన్నాడు. త్వరలో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పర్యటించనున్న నేపథ్యంలో నజ్ముల్ హసన్ స్పందించారు. ‘ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమని మా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరికి వారు ఇష్టముంటే వెళ్లవచ్చు. అక్కడ భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఒకవేళ పాక్‌కు వెళ్లకూడదని అనుకుంటే వెళ్లవద్దు. ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ను రిప్లేస్ చేయడం కష్టం. అప్పటి పరిస్థితుల్ని బట్టి పాక్ పర్యటనకు వెళ్లే జట్టు ఎంపిక ఉంటుంది’ అని నజ్ముల్ హసన్ తెలిపారు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు తమ మహిళల క్రికెట్ జట్టుతో పాటు పురుషుల జట్టు కూడా వెళ్లిందనే విషయానం్ని నజ్ముల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు సెక్యూరిటీ పరమైన హామీ లభించిన తర్వాతే అక్కడకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకా భద్రతా పరమైన హామీ ఇంకా లభించలేదని, దీనిపై త్వరలో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. -
ఐపీఎల్ 2020: ముస్తాఫిజుర్‌కు లైన్ క్లియర్
ఢాకా: గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడటానికి తమ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీకి దూరమైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు ఈసారి క్లియరెన్స్ లభించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ముస్తాఫిజుర్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ సీజన్లో జరుగనున్న ఐపీఎల్ వేలానికి ముస్తాఫిజుర్ అందుబాటులో ఉండనున్నాడు. దాంతో డిసెంబర్-19 వ తేదీన ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని ముస్తాఫిజుర్ పరీక్షించుకోనున్నాడు. దీనిపై బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ ముస్తాఫిజుర్‌ను ఎక్కువగా క్రికెట్ ఆడనివ్వకుండా చేయడానికి కారణం అతను తరచు గాయాల బారిన పడటమే. ప్రధానంగా విదేశీ లీగ్‌ల్లో ఆడకుండా ముస్తాఫిజుర్‌ను అడ్డుకుంటూ వచ్చాం. ప్రస్తుతం ముస్తాఫిజుర్ ఎటువంటి సీరియస్ గాయాలు కాకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకోసమే ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇచ్చాం. అతని ఐపీఎల్ ప్రదర్శనతో తిరిగి గాడిలో పడతాడని ఆశిస్తున్నాం. అది మా జట్టుకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ముస్తాఫిజుర్ మాకు చాలా కీలకమైన బౌలర్. మళ్లీ సత్తాచాటుకుని పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని అనుకుంటున్నాం’ అని అక్రమ్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్–2020 కోసం జరిగే వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా, 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడినవారున్నారు. అయితే ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం నిర్వహిస్తారు. -
ఫీల్డ్‌లోనే సహచర ఆటగాడ్ని కొట్టిన క్రికెటర్
ఖుల్నా: క్రికెట్ మైదానంలోనే సహచర క్రికెటర్‌పై భౌతిక దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ క్రికెటర్ షహదాత్ హుస్సేన్‌పై ఏడాది నిషేధం పడింది. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్-ఖుల్నా డివిజన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్ దాడికి పాల్పడ్డాడ్డు. బంతిని ఒకవైపే షైన్ చేయొద్దంటూ సహచర ఆటగాడు ఆరాఫత్ సన్నీ చెప్పడంతో ఆగ్రహానికి గురైన షహదాత్ దాడికి దిగాడు. ఫీల్డ్‌లో అంతా చూస్తుండగానే ఎందుకు షైన్ చేయకూడదంటూ ఆరాఫత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చి కొట్లాటను అడ్డుకున్నారు. దీనిపై ఆరాఫత్ మాట్లాడుతూ.. బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదని షహదాత్‌కు చెప్పిన క్రమంలో అతను తనతో గొడవకు దిగాడన్నాడు. అదే సమయంలో తనను కొట్టాడని పేర్కొన్నాడు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)సీరియస్ అయ్యింది. జట్టులోని సహచర ఆటగాడిగాపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లెవల్ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై 12 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ నుంచి షహదాత్ వైదొలిగాల్సి వచ్చింది. తాజా వివాదంపై షహదాత్ మాట్లాడుతూ.. ‘ నేను సస్పెండ్ అయిన కారణంగా ఎన్సీఎల్ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేను. నా సహనాన్ని కోల్పోయిన మాట వాస్తవం. కానీ అతను కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతన్ని చేయి చేసుకునే వరకూ వెళ్లాల్సి వచ్చింది. నేను బంతిని షైన్ చేస్తుంటే వద్దన్నాడు. ఎందుకు అని అడిగా. కానీ గట్టిగా అరుస్తూ నన్ను ఏదో అన్నాడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్రమంలోనే కొట్టాల్సి వచ్చింది’ అని తెలిపాడు. బంగ్లాదేశ్ తరఫున 38 టెస్టులు ఆడిన షహదాత్ 72 వికెట్లు తీశాడు.ఇక 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. 2015లో ఒకసారి షహదాత్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. భార్యను వేధించిన కేసులో షహదాత్ ఇరుక్కోవడంతో అతనిపై నిషేధం పడింది. ఆపై కొన్ని నెలలకు షహదాత్ అభ్యర్థన మేరకు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇచ్చింది. 2015లో బంగ్లాదేశ తరఫున షహదాత్ చివరిసారి ఆడాడు. -
‘ఒక్క రోజులోనే లెజెండ్స్ కాలేరు’
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టాడు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన షకీబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతడిపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పటికే షకిబుల్‌కు హసన్‌కు మద్దతుగా ఆ దేశ క్రికెటర్లు అండగా నిలవగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంచితే, షకిబుల్ సస్పెన్షన్‌పై అతని భార్య ఉమ్మీ అహ్మద్ షిషిర్ స్పందించారు. ‘లెజెండ్స్.. ఏదో ఒక్కరాత్రిలో లెజెండ్స్ కాలేరు. ఎంతో శ్రమిస్తే కానీ ఓ దశకు చేరుకోరు. వాళ్లకూ కష్టకాలం వస్తుంది. కానీ, దృఢ సంకల్పం, మనోధైర్యంతో ఆ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటారు. షకిబల్ మానసిక స్థయిర్యం నాకు బాగా తెలుసు. గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైనా, తిరిగి ప్రపంచక్‌పలో అతనెలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. ఇది అతనికి కష్టకాలం. అతని కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అని ఉమ్మీ పేర్కొన్నారు. -
‘మాకు ముందుగా ఏమీ తెలీదు’
ఢాకా: షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించడం వెనక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కుట్ర ఉన్నదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీసీబీ వివరణ ఇచ్చింది. గత వారం ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లకు సంబంధించి షకీబ్ తిరుగుబాటు చేయగా, సమ్మె ముగిసిన తర్వాత కూడా ఆ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. దాంతో షకీబ్‌ను బోర్డు కావాలనే ఇరికించిందని పలువురు విమర్శలకు దిగారు. ‘దీనిపై నేను స్పష్టత ఇవ్వదల్చుకున్నాను. ఫిక్సింగ్‌కు సంబంధించి జనవరి నుంచి సాగిన దర్యాప్తుతో నాకు గానీ మా బోర్డుకు కానీ ఎలాంటి సంబంధం లేదు. స్వతంత్ర సంస్థ అయిన అవినీతి నిరోధక విభాగం స్వయంగా షకీబ్‌తో మాట్లాడింది. ఆటగాళ్ల సమ్మెకు సంబంధించి చర్చలు ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల క్రితం మాత్రమే అతను నాకు ఈ విషయం తెలియజేశాడు. ముందుగా చెప్పలేదని కోపం నాకూ ఉంది. కానీ అతను ఐసీసీకి తగిన విధంగా సహకరించాడు. అలాంటి కీలక ఆటగాడి సేవలు కోల్పోవడం దురదృష్టకరం’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వ్యాఖ్యానించారు. మరోవైపు షకీబ్ నిషేధంపై ఆగ్రహం చెందిన బంగ్లాదేశ్ అభిమానులు ఆ దేశంలో వేర్వేరు చోట్ల నిరసనలకు దిగారు. భారత్ చేరిన బంగ్లా జట్టు... టి20 సిరీస్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టు బుధవారం రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. షకీబ్లాంటి ఆటగాడు లేని లోటు తీర్చలేనిదని, అయితే మరింత పట్టుదలగా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని జట్టు టి20 కెపె్టన్ మహ్ముదుల్లా అన్నాడు. ప్రస్తుతానికి ఒక ఆటగాడు గాయమై సిరీస్‌కు దూరమైతే ఎలా ఉంటుందో అదే తరహాలో షకీబ్ గురించి భావిస్తున్నట్లు అతను చెప్పాడు. భారత్‌పై తమ రికార్డు పేలవంగా ఉందని అంగీకరించిన మహ్ముదుల్లా... సంచలనం సృష్టించగల సత్తా బంగ్లా జట్టుకు ఉందని అభిప్రాయపడ్డాడు. నవంబర్ 3, 7, 10 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. -
కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దాదా
ముంబై : డే-నైట్ టెస్టు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. టెస్టుల్లో నంబర్ వన్ జట్టైన టీమిండియా ఇప్పటివరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. భారత్-బంగ్లాదేశ్ మినహా అన్ని టెస్టు జట్లు డే నైట్ టెస్టులు ఆడాయి. పలు కారణాలు చూపుతూ డేనైట్ టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డే నైట్ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు. అంతేకాకుండా తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా వడివడిగా అడుగులు వేశాడు. మొదట కోహ్లిని ఒప్పించిన దాదా అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డేనైట్ టెస్టు కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనలకు బీసీబీ అంగీకారం తెలపడంతో టీమిండియా తొలి డే-నైట్ టెస్టుకు మార్గం సుగుమమైంది. దీంతో కోలకతా వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి డే-నైట్ టెస్టుకు అంకురార్పణ జరగనుంది. టీమిండియా తొలి డే నైట్ టెస్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు అంగీకారం తెలిపిన కెప్టెన్ కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని గంగూలీ అన్నాడు. అయితే సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాల్సిందేనని దాదా పేర్కొన్నాడు. నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్లో పింక్‌బాల్ క్రికెట్ ఆడించాలని అప్పటి క్రికెట్ కమిటీ చైర్మన్ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. ఇక అధ్యక్షుడిగా కేవలం 9 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో భారత క్రికెట్ అభివృద్ధికి దాదా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
షకిబుల్‌కు భారీ ఊరట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హసన్‌కు భారీ ఊరట లభించింది. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన షకిబుల్.. ఒక స్థానిక టెలికాం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇది బోర్డు నియమావళిని అతిక్రమించనట్లు కావడంతో షకిబుల్‌పై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావించింది. ఈ క్రమంలోనే బీసీబీ పంపిన షోకాజ్ నోటీసుకు పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే మనసు మార్చుకుంది. దీనిపై బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ.. ‘ ఇది బోర్డు అంతర్గత వ్యవహారం. దీనికి ఇక్కడితే ముగింపు పలకాలని అనుకుంటున్నాం. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అయితే జాతీయ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు షకిబుల్‌పై సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు నజ్ముల్లా తెలిపిన సంగతి తెలిసిందే. అక్టోబర్22వ తేదీన గ్రామీఫోన్ టెలికాం సంస్థకు షకిబుల్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. దాంతో బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపాం. షకీబుల్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. దాంతో పాటు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
టీమిండియా ప్రపోజల్.. బంగ్లా ఓకే చెప్పేనా?
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ.. డే అండ్ నైట్ టెస్టులకు విపరీతమైన ఆసక్తికనబరుస్తున్నాడు. తాను అధ్యక్ష బాధ్యతలు ప్రారంభించిన మరుక్షణమే కెప్టెన్ విరాట్ కోహ్లితో డే అండ్ నైట్ టెస్టుల గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నాడు. అందుకు కోహ్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గంగూలీ తన కార్యచరణను ముమ్మరం చేశాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి బీసీసీఐ లేఖ రాసింది. అందుకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్లో జరిగే టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్ మ్యాచ్‌గా నిర్వహించాలని చూస్తున్నామని, అందుకు అభిప్రాయం చెప్పాలంటూ బీసీబీని కోరింది. అయితే దీనిపై బీసీబీ నుంచి ఎటువంటి హామీ రాలేదు. ‘ మేము బీసీసీఐ నుంచి లేఖను అందుకున్నాం. మా భారత పర్యటనలో ఒక టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్‌గా నిర్వహించాలనే ప్రపోజల్ అది. దీనిపై ఆలోచిస్తున్నాం. ఇంకా ఎటువంటి చర్చలు జరపలేదు. మరో రెండు-మూడు రోజుల్లో మా నిర్ణయాన్ని బీసీసీఐకి తెలుపుతాం’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపారు. భారత్-బంగ్లాదేశ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీ20 సిరీస్ జరుగనుంది. నవంబర్3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టీ20తో సిరీస్ ఆరంభం కానుంది. -
ప్రమాదంలో షకిబుల్ కెరీర్
మిర్పూర్: ఇటీవల తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు నేతృత్వం వహించిన ఆల్ రౌండర్ షకిబుల్ టార్గెట్ చేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఒక స్థానిక టెలికాం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా షకిబుల్ వ్యవహరించడంతో అతనిపై చట్టపరమైన తీసుకోవడానికి బీసీబీ సిద్ధమైంది. బీసీబీ ఆటగాళ్ల ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ కల్గిన ఒక జాతీయ స్థాయి క్రికెటర్ ఏ టెలికాం కంపెనీతోనూ జట్టు కట్టకూడదు. అయితే దీన్ని షకిబుల్ అతిక్రమించడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు ఆగమేఘాల మీద ప్రణాళిక రూపొందిస్తోంది. కనీసం ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండానే అతన్ని ఇరకాటంలో పెట్టేందుకు చూస్తోంది. దాంతో షకిబుల్ హసన్ కెరీర్ ప్రమాదంలో పడింది. అక్టోబర్22వ తేదీన గ్రామీఫోన్ టెలికాం సంస్థకు షకిబుల్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఇది బీసీబీకి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో ఆటగాళ్లను వెంటబెట్టుకుని మరీ సమ్మెకు దిగడం కూడా బీసీబీ జీర్ణించుకోలేకపోతుంది. దాంతో షకిబుల్‌ను జట్టు నుంచి సాగనంపడానికి బీసీబీకి ఒక వివాదం దొరికింది. ‘ షకీబుల్‌పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్ పరిహారం చెల్లించుకోవాల్సింది. కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపాం. షకీబుల్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. దాంతో పాటు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం’ బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్ పేర్కొన్నారు.(ఇక్కడ చదవండి: ఏయ్ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్!) -
క్రికెటర్ల స్ట్రైక్ దెబ్బకు దిగొచ్చిన బోర్డు
ఢాకా: ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో క్రికెటర్లు తమ సమ్మెకు ముగింపు పలికారు. దీనిలో భాగంగా మాట్లాడిన బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హసన్.. క్రికెటర్లను డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగతా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని క్రికెటర్లతో జరిపిన చర్చల్లో ప్రస్తావించడంతో వార అందుకు అంగీకారం తెలిపారన్నాడు. ఫలితంగా క్రికెటర్ల సమ్మెలో కీలక పాత్ర పోషించిన షకిబుల్ హసన్‌కు డిమాండ్ల విషయంపై క్లారిటి ఇచ్చామన్నాడు. క్రికెటర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారన్నాడు. శనివారం నుంచి తమ జాతీయ క్రికెటర్లు యథావిధిగా మ్యాచ్‌లకు సిద్ధం కానున్నారన్నాడు. దాంతో వచ్చే నెలలో భారత్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు, రెండు టెస్టుల సిరీస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. సొమవారం కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమంటూ బంగ్లా క్రికెటర్లు నిరసన బాట పట్టాడరు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించారు. దాంతో వెంటనే లాయర్ సమక్షంలో చర్చలు జరిపిన బీసీబీ.. దాదాపు అన్ని డిమాండ్లను నేరవేర్చడానికి ముందుకొచ్చింది. -
‘సారీ.. పాక్ పర్యటనకు వెళ్లలేను’
ఢాకా: తాను పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేనని బంగ్లాదేశ్ మహిళా క్రికెట జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న భారత మాజీ క్రీడాకారిణి అంజు జైన్ తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ పర్యటనకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుతో తాను వెళ్లలేనని బోర్డుకు తెలిపారు. అంజు జైన్‌తో మరో ఇద్దరు కూడా పాక్ పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైలమాలో పడింది. పాక్ పర్యటనలో రెండు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిన తరుణంలో అంజు జైన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. దాంతో తాత్కాలిక కోచ్‌ను ఎంపిక చేసి పాక్ పర్యటనకు పంపాలనే యోచనలో బీసీబీ ఉంది. దీనిపై బంగ్లాదేశ్ టీమ్ మేనేజర్ జావేద్ ఓమర్ మాట్లాడుతూ.. భారత్ కోచ్‌లు పాక్ పర్యటనకు పంపడం అనేది మా చేతుల్లో లేదు. ఇది చాలా సున్నితమైన అంశం’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పర్యటించడంపై బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజాముద్దీన్ చౌధురి మాట్లాడుతూ.. భద్రతా పరమైన హామీ లభించిన తర్వాత పాక్ పర్యటనకు మొగ్గుచూపినట్లు పేర్కొన్నారు. ‘మేము పీసీబీతో టచ్‌లో ఉన్నాం. అక్కడ మాకు ఏ విధమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉన్న విషయాన్ని కూడా గమనిస్తున్నాం. పాక్‌లో పరిస్థితిపై ఐసీసీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది’ అని నజాముద్దీన్ తెలిపారు. -
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా జాఫర్
ఢాకా: ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌కు తాజాగా ఆ దేశ క్రికెట్ హై పర్ఫామెన్స్ యూనిట్‌లోనూ చోటు కల్పించారు. వసీం జాఫర్‌ను బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన నీల్ మెకంజే స్థానంలో జాఫర్‌ను ఎంపిక చేసింది. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బౌలింగ్ కన్సల్టెంట్ చంపక రమననాయకేతో కలిసి జాఫర్ పని చేయనున్నాడు. ‘ కొన్ని వ్యక్తిగత వ్యవహారాల కారణంగా మెకంజీ బ్యాటింగ్ కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో జాఫర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయాల్సి వచ్చింది. మేము ఎటువంటి కోచ్‌లను నియమించాలనే దానిపై మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. పరిస్థితుల్ని బట్టి వారి సేవల్ని ఉపయోగంచుకుంటాం. మెకంజీతో ఇంకా కాంట్రాక్ట్ ముగియ లేదు. అతనిక అదనపు బాధ్యతలు అప్పచెబుతాం’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపారు. -
వసీం జాఫర్ కొత్త ఇన్నింగ్స్
ఢాకా: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో బ్యాటింగ్ కోచ్‌గా ఒప్పందం చేసుకున్నాడు. అయితే జాఫర్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించేది సదరు క్రికెట్ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే. ఈ మేరకు తమతో జాఫర్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని బీసీబీ గురువారం ప్రకటించింది. ఏడాది కాలానికి జాఫర్ తమతో ఒప్పందం చేసుకున్నట్లు బీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మే నెల నుంచి 2020 ఏప్రిల్ వరకూ మిర్పూర్లో ఉన్న తమ అకాడమీలో జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తారన్నారు. ప్రధానంగా అండర్-16 మొదలుకొని అండర్-19 జట్లలోని యువ క్రికెటర్లు జాఫర్ పర్యవేక్షణలోని శిక్షణ పొందనున్నారు. రంజీల్లో 19 సీజన్ల పాటు ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జాఫర్..ఆపై విదర్భకు మారిపోయాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్ సాధించిన విదర్భ జట్టులో జాఫర్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా, భారత్ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 212. -
ముస్తాఫిజుర్‌కు నో క్లియరెన్స్
ఢాకా: గత కొన్ని సీజన్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడుతూ వస్తున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఐపీఎల్లో ఆడటానికి క్లియరెన్స్ ఇవ్వాలంటూ ముస్తాఫిజుర్ చేసుకున్న విజ్ఞప్తి ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) తాజాగా తిరస్కరించింది. ముస్తాఫిజుర్ తరుచు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొంటూ గాయాల బారిన పడుతున్నాడు. దాంతో ముస్తాఫిజుర్‌ను టీ20 లీగ్‌లకు అనుమతి నిరాకరిస్తూ గత జూన్ మాసంలో బీసీబీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా ముస్తాఫిజుర్‌ను విదేశాల్లో జరిగే టీ20ల్లో పాల్గొనకుండా బీసీబీ నియంత్రిస్తుంది. ప్రధానంగా జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బోర్డు.. మరొకసారి అదే విషయాన్ని ముస్తాఫిజుర్‌కు తెలియజేస్తూ ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇవ్వడానికి నిరాకరించింది. 2016 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించడంలో ముస్తాఫిజుర్ కీలక పాత్ర పోషించాడు . 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు సాధించి ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 2017కు వచ్చేసరికి హైదరాబాద్ తరఫున కేవలం మ్యాచ్ మాత్రమే ఆడాడు. కాగా, 2018లో ముంబై ఇండియన్స్ ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజర్ గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ ముస్తాఫిజుర్‌ను వదలుకుంది. ముంబై ఇండియన్స్ 10 మంది ఆటగాళ్లను విడుదల చేయగా అందులో ముస్తాఫిజుర్‌ను కూడా చేర్చింది. త్వరలో ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ తమ దేశ క్రికెట్ బోర్డును ఆశ్రయించగా అతని చుక్కెదురైంది. -
ముస్తాఫిజుర్‌కు షాక్!
ఢాకా: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) షాకిచ్చింది. రెండేళ్ల పాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు దూరంగా ఉండాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో సహా ఇతర విదేశీ లీగ్‌ల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాల్గొనకూడదంటూ ముస్తాఫిజుర్‌ను హెచ్చరించింది. విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతున్న ముస్తాఫిజుర్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని రెండేళ్ల పాటు టీ20 లీగ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ స్పష్టం చేశారు. ‘లీగ్‌లు ఆడటం వల్ల ముస్తాఫిజుర్ గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల ర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు. దాంతో అతన్ని రెండేళ్లు టీ 20 లీగ్‌లు ఆడొద్దని చెప్పాం. బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేం కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ’ అని నజ్ముల్ తెలిపారు. -
‘నాకు క్రికెటర్లతో విభేదాలు లేవు’
ఢాకా: తాను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి సీనియర్ క్రికెటర్లతో విభేదాలు ఎంతమాత్రం కారణం కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు రిచర్డ్ హల్సాల్ తాజాగా స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ పదవికి గత నెల్లో రిచర్డ్ హల్సాల్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బంగ్లాదేశ్ ఘోర వైఫల్యం అనంతరం రిచర్డ్ హల్సాల్ ఉన్నపళంగా పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లతో విభేదాలతోనే జట్టు అసిస్టెంట్ కోచ్ పదవికి హల్సాల్ వీడ్కోలు చెప్పినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై సోమవారం బీసీబీ కార్యాలయానికి హాజరైన హల్సాల్ మాట్లాడుతూ..‘ సీనియర్ క్రికెటర్లతో సఖ్యత లేదని వార్తల్లో నిజం లేదు. సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయం అనేది జట్టుకు ఎప్పుడూ అవసరమే. వారి నుంచి చాలా సందర్భాల్లో సలహాలు స్వీకరించా. వారితో ఎప్పుడూ నాకు అభిప్రాయ భేదాలు రాలేదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి వైదొలిగా’ అని రిచర్డ్ హల్సాల్ వివరణ ఇచ్చాడు.