టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లా జట్టు ఇదే | Bangladesh Announced-Squad 1st-Test Vs India Shakib-Al-Hasan Captain | Sakshi
Sakshi News home page

IND Vs BAN: టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లా జట్టు ఇదే

Published Thu, Dec 8 2022 9:05 PM | Last Updated on Thu, Dec 8 2022 9:06 PM

Bangladesh Announced-Squad 1st-Test Vs India Shakib-Al-Hasan Captain - Sakshi

టీమిండియతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. శనివారం(డిసెంబర్‌ 10న) మూడో వన్డే జరగనుండగా.. టీమిండియా మాత్రం విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇక బంగ్లా క్రికెట్‌ బోర్డు(బీసీబీ) వన్డే సిరీస్‌ తర్వాత జరగనున్న టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించింది. బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టును నడిపించనుండగా.. సీనియర్‌ ప్లేయర్స్‌ ముష్పికర్‌ రహీమ్‌, తస్కిన్‌ అహ్మద్‌లు తుది జట్టులోకి తిరిగి వచ్చారు.

గాయం కారణంగా తస్కిన్‌ వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్‌ సమయానికి తస్కిన్‌ పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేడో తెలియకపోయినా అతన్ని ఎంపిక చేశారు. ఇక శనివారం మూడు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత డిసెంబర్‌ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 14 నుంచి 18 వరకూ చట్టోగ్రామ్‌ వేదికగా తొలి టెస్ట్‌ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 22 నుంచి 26 వరకూ రెండో టెస్ట్‌ మీర్పూర్‌లో జరగనుంది.

తొలి టెస్ట్‌కు బంగ్లాదేశ్‌ జట్టు: షకీబుల్‌ హసన్‌ (కెప్టెన్‌), మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నజ్ముల్‌ హసన్‌ షాంటో, మోమినుల్‌ హక్‌, యాసిర్‌ అలీ చౌదరీ, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, తైజుల్‌ ఇస్లామ్, తస్కిన్‌ అహ్మద్‌, సయ్యద్‌ ఖాలెద్‌ అహ్మద్‌, ఇబాదత్‌ హుస్సేన్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, జాకిర్‌ హసన్‌, రెజావుర్‌ రెహమాన్‌, అనాముల్‌ హక్‌ బిజోయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement