ఢాకా: కరోనాతో విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభించాలనుకున్న బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్‌కు మొండి చేయి ఎదురైంది. అతనితో పాటు మరికొంత మంది క్రికెటర్లు మిర్పూర్‌లోని షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొంటామని విజ్ఞప్తి చేయగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో ఈ సమయంలో బహిరంగ శిక్షణ మంచిది కాదంటూ వారి ప్రతిపాదనను తిరస్కరించింది.
‘ప్రాక్టీస్ చేసేందుకు ఇది తగిన సమయం కాదని మేం ముష్ఫికర్‌ను వారించాం. ట్రెయినింగ్ ముఖ్యమే కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అన్నింటికన్నా ప్రధానం. మిర్పూర్‌లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాం. పూర్తి స్థాయిలో మైదాన పరిసరాలు సురక్షితం కాలేదు’ అని బీసీబీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment