వన్డే ప్రపంచకప్-2023కు తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్‌కు చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు, ఇక్భాల్‌కు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరినట్లు తెలుస్తోంది.
గాయంతో బాధపడుతున్న తమీమ్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే టోర్నీ నుంచి తప్పుకుంటానని బీసీబీని షకీబ్ బెదిరించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా వెన్ను గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్‌తో తమీమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు అన్నిఫార్మాట్‌ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఆడాలని నిర్ణయించకున్నాడు. కానీ అనుహ్యంగా అతడికి ఏకంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు.
అవన్నీ రూమర్సే
ఇక తమీమ్- షకీబ్ విభేదాల వార్తలపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్ అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. "తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు.
అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ ఎంపిక చేయలేదని అబేదిన్ తెలిపాడు. అంతేకాకుండా తమీమ్‌ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన అన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై తమీమ్ ఇక్భాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెత్త ఆటలో తను బాగం కాకూడదనుకుంటానని తమీమ్ తెలిపాడు.
కావాలనే నన్ను తప్పించారు..
"వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ముందు బంగ్లా క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్‌కప్ కోసం జట్టుతో కలిసి నేను భారత్‌కు వెళ్తానని ఆయన చెప్పారు. నా ఫిట్‌నెస్‌ను మరోసారి ఆయన నిరూపించుకోమన్నారు. అదేవిధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు.
అందుకు బదులుగా వరల్డ్‌కప్‌కు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం ఉంది, అయినా నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాను. దీంతో ఒక వేళ మీరు జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారిగా అతను ఏమి మాట్లాడాతున్నారో నాకు అర్ధం కాలేదు.
వెంటనే నేను పూర్తిగా పాజిటివ్ మైండ్‌తో ఉన్నా. కొన్ని రోజుల తర్వాత న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఒక్కసారిగా నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంటని ఆయనతో అన్నాను. నేను గత 17 ఏళ్లగా ఓపెనింగ్ స్ధానంలోనే ఆడుతున్నాను. ఎప్పుడూ మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేయలేదు. అటువంటి అప్పుడు నా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారుస్తారు.
మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు లేదు. ఫిజియో రిపోర్ట్ ప్రకారం.. నా ఫిట్‌నెస్ లెవల్స్ నాకు తెలుసు. కివీస్ తొలి వన్డే, రెండో వన్డే తర్వాత నేను కాస్త నొప్పితో బాధపడ్డా. అది వాస్తవం. కానీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆఖరి వన్డేకు జట్టు సెలక్షన్‌కు నేను అందుబాటులోకి వచ్చా.
కానీ జట్టు వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని సూచించారు. వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్‌కు దాదాపు రెండు రోజుల విశ్రాంతి లభిస్తోంది. నాకు అది చాలు . ఇప్పటికే నేను దాదాపు 10 వారాల పాటు రిహాబిలేటేషన్‌లో ఉన్నా. ఉద్దేశ్వపూర్వకంగానే నన్ను జట్టు నుంచి తప్పించారు అని తమీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్‌చేశాడు.
చదవండి: IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment