Ban Vs Nz 1st Test: Trolls On Taskin Ahmed Worst Review Ever - Sakshi
Sakshi News home page

Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..

Published Tue, Jan 4 2022 12:14 PM | Last Updated on Tue, Jan 4 2022 6:14 PM

Nz Vs Ban 1st Test: DRS Howler By Bangladesh Worst Review Ever Trolls - Sakshi

PC: Twitter

Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్‌. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించిన బంగ్లా... కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం, రనౌట్‌లు మిస్‌ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. 

ముఖ్యంగా 37వ ఓవర్‌లో టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్‌ చేసుకుంది. టస్కిన్‌ వేసిన బంతిని కవర్స్‌ దిశగా ఆడేందుకు రాస్‌ టేలర్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్‌ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్‌ మొమినల్‌ అప్పీలు చేయగా నెగటివ్‌ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.

అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్‌ టేలర్‌ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్‌ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్‌.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్‌ చేసిన ధావన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement