బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్‌లు చెరొక వికెట్ పడగొట్టారు.
ఇక టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.
అంతకముందు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్ హక్ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్) మార్క్ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది.
అఫ్గానిస్తాన్: తొలి ఇన్నింగ్స్ : 146 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 115 ఆలౌట్
బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్: 382 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: 425/4 డిక్లేర్
ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం
Walton Test Match: Bangladesh vs Afghanistan | Only Test | Day 04
— Bangladesh Cricket (@BCBtigers) June 17, 2023
Bangladesh won by 546 runs.
Full Match Details: https://t.co/MDvtIwN35K#BCB | #Cricket | #BANvAFG pic.twitter.com/sk24j4tteZ
Comments
Please login to add a commentAdd a comment