అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ సాధించిన బంగ్లాదేశ్ సారథిగా రికార్డులకెక్కాడు షాంటో.
టెస్టులకు, టీ20లకు వేరే కెప్టెన్లు!
అయితే, ఆ తర్వాత భారత పర్యటనలో టెస్టుల్లో 2-0తో క్లీన్‌స్వీప్ సహా.. స్వదేశంలో సౌతాఫ్రికాలో చేతిలోనూ టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ షాంటో వన్డే సారథిగా కొనసాగేలా ఒప్పించినట్లు సమాచారం.
ఈ క్రమంలో అతడినే సారథిగా కొనసాగిస్తున్నట్లు తాజా ప్రకటనతో వెల్లడైంది. మరోవైపు.. టెస్టులకు మెహదీ హసన్ మిరాజ్, టీ20లకు టస్కిన్ అహ్మద్ లేదంటే తౌహీద్ హృదోయ్ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటన
ఇదిలా ఉంటే.. వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య షార్జా వేదికగా నవంబరు 6, నవంబరు 9, నవంబరు 11 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం బంగ్లా- అఫ్గన్ మ్యాచ్‌లు సాయంత్రం ఐదు గంటలకు ఆరంభం కానున్నాయి.
ఇక.. అఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టులో పేసర్ సషీద్ రాణా తొలిసారి చోటు దక్కించుకోగా.. లిటన్ దాస్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక తంజీమ్ అహ్మద్ సైతం భుజం నొప్పి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేదని బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపాడు.
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు
సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ షాంటో(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, తౌహీద్ హృదోయ్, జాకెర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్(వైస్ కెప్టెన్), రిషాద్ హొసేన్, నసూం అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, నషీద్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment