Ebadot Hossain
-
మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ అవుట్
Ebadot Hossain ruled out of Bangladesh's Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రైట్ ఆర్మ్ పేసర్ ఇబాదత్ హుసేన్ చౌధురి జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా మెగా టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని యువ సంచలనం తంజీమ్ హసన్ సకీబ్తో బంగ్లా క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నీకై ఆగష్టు 12న బంగ్లాదేశ్ 17 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఆరు వారాల విశ్రాంతి అవసరం అయితే, ప్రధాన జట్టులో సభ్యుడైన ఇబాదత్ హుసేన్ పూర్తిగా కోలుకోలేదు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ అతడికి మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమైనట్లు బీసీబీ చీఫ్ స్పోర్ట్స్ ఫిజీషియన్ డాక్టర్ దేబాశిష్ చౌధురి తెలిపాడు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న 29 ఏళ్ల ఇబాదత్కు ఆరు వారాల పాటు రెస్ట్ కావాలని పేర్కొన్నాడు. కాబట్టి ఆసియా కప్ టోర్నీకి అతడు దూరం కానున్నట్లు దేబాశిష్ వెల్లడించాడు. ఇబాదత్ నొప్పి తీవ్రమైందని.. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు మైదానంలో దిగే విధంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నాడు. యువ ఆటగాడికి లక్కీ ఛాన్స్ అవసరమైతే విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉందని తెలిపాడు. కాగా ఇబాదత్ హుసేన్ దూరమైన కారణంగా తంజీమ్ హసన్ సకీబ్‌కు ప్రమోషన్ లభించింది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 గెలిచిన జట్టులో తంజీమ్ సభ్యుడు. ఇటీవల ముగిసిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మూడు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పల్లకెలె వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్ ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023కి బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్ స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. -
బౌలర్ల ప్రతాపం.. పట్టుబిగించిన బంగ్లాదేశ్
ఓ టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 2 టీ20ల సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 14) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పట్టుబిగించింది. రెండో రోజు ఆట సమయానికి ఆ జట్టు 370 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను (134/1) కొనసాగిస్తోంది. మహ్మదుల్ హసన్ జాయ్ (17) ఔట్ కాగా.. జకీర్ హసన్ (54), నజ్ముల్ హసన్ షాంటో (54) క్రీజ్‌లో ఉన్నారు. దీనికి ముందు బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు చాపచుట్టేసింది. ఎబాదత్ హొసేన్ (4/47), షొరీఫుల్ ఇస్లాం (2/28), తైజుల్ ఇస్లాం (2/7), మెహిది హసన్ మీరజ్ (2/15) మూకుమ్మడిగా రాణించి, ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మలిక్ (17), నసిర్ జమాల్ (35), జజాయ్ (36), కరీమ్ జనత్ (23) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ హసన్ షాంటో (146) సెంచరీతో కదంతొక్కగా.. మహ్మదుల్ హసన్ (75), ముష్ఫికర్ రహీమ్ (47), మెహిది హసన్ మీరజ్ (48) రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నిజత్ మసూద్ 5 వికెట్లతో చెలరేగగా.. అహ్మద్జాయ్ 2, జహీర ఖాన్, అమీర్ హమ్జా, రహ్మత్ తలో వికెట్ పడగొట్టారు. -
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్‌బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్ ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి కూడా -
నిప్పులు చెరిగిన పేసర్లు.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..!
సొంతగడ్డపై ఇటీవలే ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు షాకిచ్చి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా టైగర్స్.. తాజాగా ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే (2 మ్యాచ్‌ల తర్వాత) 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్.. ఇవాళ (మార్చి 23) జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (8.1-1-32-5), తస్కిన్ అహ్మద్ (10-1-26-3), ఎబాదత్ హొస్సేన్ (6-0-29-2) గోలాల్లాంటి బంతులు సంధించి ఐర్లాండ్‌ను మట్టికరిపించారు. వీరి దెబ్బకు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. కేవలం ఇద్దరు (టక్కర్ (28), కర్టిస్ క్యాంపర్ (36)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. యాదృచ్చికమైన విషయమేమిటంటే, వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లా పేసర్లు తొలిసారి 10కి 10 వికెట్లు పడగొట్టారు. బంగ్లా వన్డే హిస్టరీలో ఇలా ఎప్పుడు జరగలేదు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (19), లిటన్ దాస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. కెప్టెన్ సహా కీలక బౌలర్ ఔట్
టీమిండియాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ ఓడిపోయి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఢాకాలోని మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ నుంచి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సహా కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. గాయాల కారణంగా వీరిద్దరు తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయారు. టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడుతున్న షకీబ్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి టెస్ట్ అనంతరం గాయం తీవ్రత పెరగడంతో షకీబ్ రెండో టెస్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ కూడా చేయలేనని షకీబ్ తేల్చిచెప్పడంతో బీసీబీ అతన్ని తప్పించక తప్పట్లేదు. మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న ఎబాదత్ హొస్సేన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని తప్పిస్తున్నట్లు బంగ్లా కోచ్ రస్సెల్ డొమింగో తొలి టెస్ట్ అనంతరమే ప్రకటించాడు. షకీబ్, ఎబాదత్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్‌ను 15 మంది సభ్యుల జట్టులోకి ఇంక్లూడ్ చేసింది. జట్టులోకి మాజీ టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హాక్ కూడా చేరాడు. షకీబ్ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు లిట్టన్ దాస్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది. రెండో టెస్ట్‌కు భారత జట్టు.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు.. మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా -
అదృష్టం అంటే శ్రేయస్‌దే.. ఈ వీడియో చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది..!
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. An incredible sequence of play in the #BANvIND Test match as @ShreyasIyer15 is bowled by Ebadot Hossain but the 𝗯𝗮𝗶𝗹𝘀 𝗷𝘂𝘀𝘁 𝗿𝗲𝗳𝘂𝘀𝗲 𝘁𝗼 𝗳𝗮𝗹𝗹 🤯 Your reaction on this close 'escape' ❓🤔#SonySportsNetwork #ShreyasIyer pic.twitter.com/q6BXBScVUz — Sony Sports Network (@SonySportsNetwk) December 14, 2022 కాగా, తొలి రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ సన్నివేశం మైదానంలో ఉండే వారితో పాటు వీక్షకులనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్ 84వ ఓవర్లో ఎబాదత్ హొసేన్ వేసిన ఓ బంతి వికెట్లకు తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో శ్రేయస్ అయ్యర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ బంతి వికెట్లను తాకాక బెయిల్ గాల్లోకి లేచినప్పటికీ తిరిగి వికెట్లపైనే పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు లక్ అంటే శ్రేయస్‌దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తొలి రోజు శ్రేయస్‌కు ఎబాదత్ హొసేన్ రూపంలోనే మరో అదృష్టం కలిసి వచ్చింది. శ్రేయస్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఎబాదత్ నేల పాలు చేశాడు. రెండు లైఫ్‌లు లభించడంతో శ్రేయస్ శతకం దిశగా సాగుతున్నాడు. -
టీమిండియాను తిప్పేసిన షకీబ్.. దెబ్బకొట్టిన ఎబాదత్
3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన షకీబ్.. 2 మెయిడిన్లు వేసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కెరీర్లో 2వ వన్డే ఆడుతున్న పేసర్ ఎబాదత్ హొస్సేన్ 8.2 ఓవర్లు వేసి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లను పెవిలియన్‌కు పంపాడు. శిఖర్ ధవన్ వికెట్ హసన్ మిరాజ్‌కు దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహముద్ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హసన్ మహముద్ 7 ఓవర్లలో మెయిడిన్ వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు
Edabot Hossain: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాదత్ హొసేన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ క్రికెటర్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే పరిమితం కాగా, తాజాగా వారి రికార్డును హొసేన్ తిరగరాశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచిన హోసేన్.. 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ రికార్డుతో పాటు హొసేన్ మరో అవమానకర రికార్డును సైతం సొంత చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హొసేన్.. 16 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం. ఈ జాబితాలో హొసేన్ తర్వాత జింబాబ్వే మాజీ ఆటగాడు పోమీ బాంగ్వా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 16 పరుగులు), టీమిండియా పేసర్ బుమ్రా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 18 పరుగులు) ఉన్నారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లా పేసర్ ఎబాదత్ హొసేన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టి కివీస్‌పై సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో టామ్ లాథమ్(252), డెవాన్ కాన్వే(109) చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 521/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్(5/43), సౌథీ(3/28), జేమీసన్(2/32)ల ధాటికి 126 పరుగులకే కుప్పకూలింది. చదవండి: ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్ -
Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు
Nz Vs Ban 1st Test: Bangladesh Historic Win Records: గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించింది. ఈ విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇది సమష్టి విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. నిజానికి ఈ విజయానికి కారణం మా బౌలర్లే. మ్యాచ్ ఆసాంతం అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇబాదత్ నిజంగా అద్భుతమే చేశాడు. గత రెండు టెస్టు మ్యాచ్‌లలో మా ప్రదర్శన బాగా లేదు. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. అయితే, ఈ గెలుపును ఇక్కడితో మర్చిపోయి.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విజయంతో బంగ్లా సాధించిన రికార్డులు: ►కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు బంగ్లా సొంతమైంది. ►అన్ని ఫార్మాట్లలోనూ ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాను అన్నింటిలోనే పరాజయమే వెక్కిరించింది. తాజా విజయంతో గెలుపులేదనే లోటు తీరిపోయింది. ►అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్ కివీస్‌ను ఓడించడం ద్వారా విదేశీ గడ్డ మీద మేటి జట్టు(టాప్-5)ను మట్టికరిపించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి. ►2011 జనవరి (హామిల్టన్‌లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా మొమినల్ బృందం నిలిచింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022 -
బంగ్లాదేశ్ సంచలనం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సరికొత్త చరిత్ర
Bangladesh Beat New Zealand By 8 Wickets In 1st Test: మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సొంత గడ్డపై ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌ను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా కివీస్ గడ్డపై బంగ్లాకు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు బంగ్లాకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ రికార్డును సాధించింది. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వైవిధ్యమైన పేస్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ వెన్ను విరిచిన ఇబాదత్ హొస్సేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఏడు వికెట్లతో మెరిసి అవార్డు అందుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే చాపచుట్టేసింది. పర్యాటక బంగ్లా 458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించగా... రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో.. Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! Bangladesh have made cricket history with their first Test win over the @BLACKCAPS Always great to see our lads in action on home soil, don’t miss Test 2 starting 9 Jan on Spark Sport#SparkSport #NZvBAN pic.twitter.com/5qv4GmxGN3 — Spark Sport (@sparknzsport) January 5, 2022 Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022