అదృష్టం అంటే శ్రేయస్‌దే.. ఈ వీడియో చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది..! | Shreyas Iyer Almost Gets Out After Ball Hits Stumps But Bails Remain intact In 1st Test Vs BAN | Sakshi
Sakshi News home page

IND VS BAN: అదృష్టం అంటే శ్రేయస్‌దే.. ఈ వీడియో చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది..!

Published Wed, Dec 14 2022 8:55 PM | Last Updated on Wed, Dec 14 2022 9:15 PM

Shreyas Iyer Almost Gets Out After Ball Hits Stumps But Bails Remain intact In 1st Test Vs BAN - Sakshi

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్‌ పుజారా (90), శ్రేయస్‌ అయ్యర్‌ (82 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్‌ పంత్‌ (46) పర్వాలేదనిపించాడు.

112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్‌ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. కేఎల్‌ రాహుల్‌ (22), శుభ్‌మన్‌ గిల్‌ (20), విరాట్‌ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్‌ పటేల్‌ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్‌ 2, ఖలీద్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

కాగా, తొలి రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ సన్నివేశం మైదానంలో ఉండే వారితో పాటు వీక్షకులనందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్‌ 84వ ఓవర్‌లో ఎబాదత్‌ హొసేన్‌ వేసిన ఓ బంతి వికెట్లకు తాకినా బెయిల్స్‌ కింద పడకపోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ బంతి వికెట్లను తాకాక బెయిల్ గాల్లోకి లేచినప్పటికీ తిరిగి వికెట్లపైనే పడింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు లక్‌ అంటే శ్రేయస్‌దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తొలి రోజు శ్రేయస్‌కు ఎబాదత్‌ హొసేన్‌ రూపంలోనే మరో అదృష్టం కలిసి వచ్చింది. శ్రేయస్‌ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఎబాదత్‌ నేల పాలు చేశాడు. రెండు లైఫ్‌లు లభించడంతో శ్రేయస్‌ శతకం దిశగా సాగుతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement