3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 4) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చెందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
బంగ్లా బౌలర్లలో షకీబ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టాడు. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన షకీబ్.. 2 మెయిడిన్లు వేసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కెరీర్‌లో 2వ వన్డే ఆడుతున్న పేసర్ ఎబాదత్ హొస్సేన్ 8.2 ఓవర్లు వేసి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లను పెవిలియన్‌కు పంపాడు.
శిఖర్ ధవన్ వికెట్ హసన్ మిరాజ్‌కు దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహముద్ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హసన్ మహముద్ 7 ఓవర్లలో మెయిడిన్ వేసి 40 పరుగులు సమర్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment