Shakib Available For Dhaka Test: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టీమిండియాతో రేపటి (డిసెంబర్ 22) నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ ఇవాళ (డిసెంబర్ 21) స్పందించాడు. షకీబ్ రెండో టెస్ట్‌లో తప్పక బరిలోకి దిగుతాడని, అతను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు.
పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడిన షకీబ్ ప్రస్తుతం కోలుకున్నాడని, రెండో టెస్ట్ కోసం అతను సెలెక్టర్లకు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ షకీబ్ బౌలింగ్ చేయలేకపోతే తుది జట్టు కూర్పులో చాలా సమస్యలు వస్తాయని, అలా జరిగితే అదనంగా స్పిన్నర్‌కు తీసుకోవాల్సి వస్తుందని, ఈ సమస్యకు తావు లేకుండానే షకీబ్ కోలుకోవడం ఆతిధ్య జట్టుకు ఊరట కలిగించే అంశమని డొనాల్డ్ వివరణ ఇచ్చాడు.
కాగా, టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్ బరిలోదిగాడు. కేవలం బ్యాటర్‌గానే తొలి టెస్ట్ ఆడిన షకీబ్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో గాయం తీవ్రత మరింత పెరిగిందని తొలి టెస్ట్ అనంతరం వైద్యులు తెలిపారు. అయితే షకీబ్.. ఈ మధ్యలో దొరికిన గ్యాప్‌లో పూర్తిగా కోలుకున్నాడని, రెండు టెస్ట్‌లో అతను ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడని ఆ జట్టు బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది.
రెండో టెస్ట్‌కు భారత జట్టు..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్ జట్టు..
మహ్ముదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, మోమినుల్ హాక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, జకీర్ హసన్, రెజౌర్ రహ్మాన్ రజా
Comments
Please login to add a commentAdd a comment