IND VS BAN 2nd Test: Captain Shakib And Ebadot Hossain Out Of Mirpur Test - Sakshi
Sakshi News home page

IND VS BAN 2nd Test: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. కెప్టెన్‌తో పాటు కీలక బౌలర్‌ ఔట్‌..?

Published Mon, Dec 19 2022 5:58 PM | Last Updated on Mon, Dec 19 2022 6:16 PM

IND VS BAN 2nd Test: Big Blow For Bangladesh, Captain Shakib And Ebadot Hossain Out Of Mirpur Test - Sakshi

టీమిండియాతో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ ఓడిపోయి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఢాకాలోని మీర్‌పూర్‌ వేదికగా డిసెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌ నుంచి ఆ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సహా కీలక బౌలర్‌ ఎబాదత్‌ హొస్సేన్‌ తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది.

గాయాల కారణంగా వీరిద్దరు తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్‌ కూడా వేయలేకపోయారు. టీమిండియాతో రెండో వన్డే సందర్భంగా ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో గాయపడిన షకీబ్‌.. గాయం పూర్తిగా మానకపోయినా తొలి టెస్ట్‌ బరిలో​దిగాడు. పక్కటెముకలు, భుజం నొప్పితో బాధపడుతున్న షకీబ్‌ తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 12 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు.

తొలి టెస్ట్‌ అనంతరం గాయం తీవ్రత పెరగడంతో షకీబ్‌ రెండో టెస్ట్‌ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్‌ కూడా చేయలేనని షకీబ్‌ తేల్చిచెప్పడంతో బీసీబీ అతన్ని తప్పించక తప్పట్లేదు.

మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న ఎబాదత్‌ హొస్సేన్‌ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని తప్పిస్తున్నట్లు బంగ్లా కోచ్‌ రస్సెల్‌ డొమింగో తొలి టెస్ట్‌ అనంతరమే ప్రకటించాడు. షకీబ్‌, ఎబాదత్‌ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో బీసీబీ (బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు) లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ నసుమ్‌ అహ్మద్‌ను 15 మంది సభ్యుల జట్టులోకి ఇంక్లూడ్‌ చేసింది. జట్టులోకి మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హాక్‌ కూడా చేరాడు. షకీబ్‌ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు లిట్టన్‌ దాస్‌ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. పుజారా (90, 102 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (20, 110), శ్రేయస్‌ అయ్యర్‌ (86), రవిచంద్రన్‌ అశ్విన్‌ (58), కుల్దీప్‌ యాదవ్‌ (40, 5/40, 3/73), అక్షర్‌ పటేల్‌ (1/10, 4/77) రాణించడంతో రాహుల్‌ సేన బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించింది.   

రెండో టెస్ట్‌కు భారత జట్టు..
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, సౌరభ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌, శ్రీకర్‌ భరత్‌, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌ 

బంగ్లాదేశ్‌ జట్టు..
మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో, మోమినుల్‌ హాక్‌, యాసిర్‌ అలీ, ముష్ఫికర్‌ రహీం, షకీబ్‌ అల్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, మెహిది హసన్‌ మీరజ్‌, తైజుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, ఖలీద్‌ అహ్మద్‌, జకీర్‌ హసన్‌, రెజౌర్‌ రహ్మాన్‌ రజా
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement