వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్- బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
విల్‌యంగ్ స్ధానంలో విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. మెహది హసన్ స్ధానంలో మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో కివీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు.
తుది జట్లు
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment