విలియమ్‌సన్‌ను రనౌట్ చేసేందుకు ప్రయత్నిస్తోన్న బంగ్లా వికెట్ కీపర్ ముష్పికర్
సాక్షి స్పోర్ట్స్: ప్రపంచకప్-2019లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా విసిరిన 244 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లలో రాస్ టేలర్(80) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేన్ విలియమ్‌సన్(40) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో మిరాజ్, షకీబ్, సైఫుద్దీన్, మోసడాక్ హుస్సేలకు తలా రెండు వికెట్లు దక్కాయి.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు సరైన ఆరంభం లభించలేదు. షకీబుల్ హాసన్(64) ఒక్కడే ఫర్వాలేదనించాడు. మిగతా వారంతా 30 లోపే పరుగులు సాధించారు. తలా ఓచేయి వేయడంతో 49.2 ఓవర్లలో 244 పరుగుల స్కోరు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీకి 4 వికెట్లు, బౌల్ట్‌కు రెండు, ఫెర్గూసన్, గ్రాండ్‌హోమ్, శాంటర్‌కు తలా ఓ వికెట్ దక్కింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment