PC: AFP
Shakib Al Hasan Comments: ‘‘ఏ ఫార్మాట్ ఆడటం ముఖ్యమైనదో... దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నాకు తెలుసు. టెస్టు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టెస్టులు ఆడతానో లేదో తెలియదు. ఒకవేళ ఆడినా.. ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు. వన్డేల్లో భాగం అవ్వాలో లేదో కూడా నిర్ణయించుకోవాలి. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వన్డేలు ఆడాల్సిందే’’అని బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. త్వరలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల టీమ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు షకీబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు దూరం కావడం వివాదానికి దారి తీసినా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం అతడికి సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలో స్థానిక టీవీ చానెల్‌ల్‌తో మాట్లాడిన షకీబ్ టెస్టులకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ఏదో ఒక ఫార్మాట్‌ను ఎంచుకోవాల్సి వస్తే మాత్రం వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
‘‘నేను ఇప్పటికిప్పుడు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని చెప్పడం లేదు. టీ20 వరల్డ్‌కప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కూడా ఆడకపోవచ్చు. టెస్టులు, వన్డేలు ఆడతాను. అయితే.. మూడు ఫార్మాట్లు ఆడటం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమే. రెండు టెస్టులకోసం నెలలపాటు కష్టపడటంలో అర్థం లేదనిపిస్తోంది. బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్తాను. స్మార్ట్‌గా ఆలోచించాలి కదా. జనవరిలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను’’ అని షకీబ్ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా బయో బబుల్ జీవితం జైలులా ఉందన్న ఈ ఆల్‌రౌండర్... ‘‘నచ్చిన చోటుకు వెళ్లకుండా ఒకే చోట ఉండటం మనసుకు కష్టంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్ జట్టు చూడండి ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించిందో... కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాళ్ల అండర్-19 జట్టును ప్రపంచకప్ టోర్నీకే పంపలేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా కుటుంబాలకు దూరంగా ఉంటూ... ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది. వారి పెంపకంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్నాళ్ల పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా’’ అని షకీబ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు వెల్లడించాడు.
చదవండి: IND vs SA: 'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్‌కు అవకాశమిస్తే'
Comments
Please login to add a commentAdd a comment