T20 WC 2022: Pakistan New Zealand Bangladesh Tri Series In October, Schedule Details - Sakshi
Sakshi News home page

T20 WC 2022: మెగా ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్‌- కివీస్‌- బంగ్లా సిరీస్‌! షెడ్యూల్‌ ఇదే!

Published Tue, Jun 28 2022 11:20 AM | Last Updated on Tue, Jun 28 2022 12:06 PM

T20 WC 2022: Pakistan New Zealand Bangladesh Tri Series In October Schedule - Sakshi

T20 WC 2022- Pakistan New Zealand Bangladesh Tri Series: టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌ ఆడనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ మేరకు జరిగే సిరీస్‌కు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదిక కానుంది. కాగా విధంగా గతేడాది న్యూజిలాండ్‌ జట్టు అర్ధంతరంగా పాకిస్తాన్‌ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో అక్కడికి వెళ్లేందుకు కివీస్‌ షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా అక్టోబరు 16న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సుమారు వారం రోజుల ముందు జరుగనున్న ఈ ట్రై సిరీస్‌తో పాక్‌, కివీస్‌, బంగ్లా జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. ఇక అక్టోబరు 8న న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఇక గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ ఈవెంట్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాయి. అయితే, సెమీస్‌లో పాక్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. ఫైనల్లో అదే ఆసీస్‌ జట్టు చేతిలో పరాజయం పాలై న్యూజిలాండ్‌ రన్నరప్‌గా నిలిచింది.

పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌: ట్రై సిరీస్‌ షెడ్యూల్‌-హాగ్లే ఓవల్‌ మైదానం, క్రైస్ట్‌చర్చ్
►అక్టోబరు 8: న్యూజిలాండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
►అక్టోబరు 9: పాకిస్తాన్ వర్సెస్‌ న్యూజిలాండ్‌
►అక్టోబరు 10: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌
►అక్టోబరు 11: న్యూజిలాండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
►అక్టోబరు 12: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌
►అక్టోబరు 13: న్యూజిలాండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
►అక్టోబరు 14: ఫైనల్‌
చదవండి: నాన్న రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్‌ శర్మ కుమార్తె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement