WTC 2021-23 Updated Points Table: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా కివీస్ గడ్డ మీద అన్ని ఫార్మాట్లలోనూ తొలి మ్యాచ్ గెలిచిన ఘనత సాధించింది. 8 వికెట్ల తేడాతో మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ విజేతను మట్టికరిపించి సత్తా చాటింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
కాగా డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో భాగంగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే, కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన మొమినల్ బృందానికి ఈ మేరకు చారిత్రక విజయం లభించడంతో టాప్-5లో చోటు దక్కించుకుంది. ఇక యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా 36 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఈ సీజన్‌లో ఇంతవరకు అపజయం చవిచూడని శ్రీలంక 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 36, భారత్ 53 పాయింట్లతో తర్వాతి స్థానాలు ఆక్రమించాయి.
ఇంగ్లండ్‌తో, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో భాగంగా రెండింటిని డ్రా చేసుకోవడం సహా ఒక మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో నాల్గవ గెలుపు నమోదు చేసింది.
Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP
— Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022
Comments
Please login to add a commentAdd a comment