
లండన్: ఈ వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టును ఓడించిన బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమైంది. మరో పంచ్ ఇవ్వాలని భావిస్తోంది. ఇక తానాడిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన కివీస్ కూడా మరో విజయం కోసం తపిస్తోంది. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
ఇప్పటివరకూ కివీస్-బంగ్లాదేశ్‌లు 35 వన్డేలు ఆడగా న్యూజిలాండ్ 24 మ్యాచ్‌ల్లో గెలవగా, 10 మ్యాచ్‌ల్లో బంగ్లా గెలిచింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కివీస్‌నే విజయం వరించింది. ఇది బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు 200 మ్యాచ్. బంగ్లాదేశ్ తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్ గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా (208 మ్యాచ్‌లు), ముష్ఫికర్ రహీమ్ (206 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
తుది జట్లు
బంగ్లాదేశ్
మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్పికర్ రహీమ్, మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసదెక్ హుస్సేన్, మెహిది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రహ్మాన్
న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంత్నార్, మ్యాట్ హెన్నీ, ఫెర్గ్యుసన్, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment