మాంచెస్టర్ : ప్రపంచకప్ నుంచి ఇప్పటికే నిష్క్రమించినప్పటికీ ఫైనల్ ముగిసేవరకు వరకూ టీమిండియా ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. దీనికి కారణం బీసీసీఐనే. క్రికెటర్లకు, సిబ్బందికి టికెట్లను సర్దుబాటు చేయడంలో బోర్డు విఫలమవ్వడంతో వారు ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాంచెస్టర్‌లోనే ఉండగా.. మరికొందరు లండన్‌కు పయనమయ్యారు. అయితే సభ్యులందరూ ఆదివారం(జులై 14) లండన్‌లో ఒక్కచోటుకు చేరుకొని స్వదేశానికి బయల్దేరుతామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇక కోహ్లి సేన ఫైనల్‌కు చేరకపోవడంతో టీమిండియా ప్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫైనల్‌కు చేరుతుందన్న నమ్మకంతో మ్యాచ్ టికెట్లతో పాటు వసతి ఏర్పాట్లు చేసుకున్న వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రీసెల్లింగ్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు టికెట్లు కొన్న వారిలో సుమారు 80 శాతానికిపైగా టీమిండియా ఫ్యాన్సే ఉన్నట్లు సమాచారం. దీంతో ఐసీసీ టికెట్లను రీ సెల్లింగ్‌కు ఇష్టపడటంలేదు. ఇక ప్రపంచకప్ ఫైనల్ పోరులో బాగంగా ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment