కోహ్లి గెలవాలి.. టీమిండియాను గెలిపించాలి | World Cup Kohli School Sending Soil To London As Blessing | Sakshi
Sakshi News home page

కోహ్లి గెలవాలి.. టీమిండియాను గెలిపించాలి

Published Sat, Jun 8 2019 8:30 PM | Last Updated on Sat, Jun 8 2019 8:35 PM

World Cup Kohli School Sending Soil To London As Blessing - Sakshi

లండన్‌: కపిల్‌దేవ్‌, ఎంఎస్‌ ధోనిల సరసన విరాట్‌ కోహ్లి నిలవాలని టీమిండియా సగటు అభిమాని కోరిక. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా హాట్‌ పేవరేట్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుపై అభిమానులు, క్రికెట్‌ పండితులు అంతగా నమ్మకం పెట్టుకోవడానికి గల కారణం విరాట్‌ కోహ్లి. గత కొంతకాలంగా టీమిండియా విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా ఎప్పుడూ లేనంతంగా బౌలింగ్‌ విభాగం అత్యంత బలంగా ఉంది. దీంతో ప్రస్తుత కోహ్లి సేననే టీమిండియాకు మళ్లీ ప్రపంచకప్‌ తీసుకొచ్చే సత్తా ఉందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోహ్లికి తోడుగా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని ఉండటంతో ఈ సారి కప్‌ మనదే అని అభిమానులు ఫిక్స్‌ అయ్యారు.

ఇక ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు టీమిండియాకు మద్దుతు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఎవరికి నచ్చినట్టు వారు వినూత్నంగా భారత జట్టుకు విషెస్‌ చెబుతున్నారు. ఇక భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలని కొందరు అభిమానులు పూజలు, యజ్ఞాలు చేస్తున్నారు. అయితే ఢిల్లీలోని కోహ్లి చదువుకున్న పాఠశాల సిబ్బంది మరింత కొత్తగా ఆలోచించారు. కోహ్లిని ఆశీర్వదిస్తూ మద్దతుగా ఆ పాఠశాల మట్టిని ప్రత్యేకంగా లండన్‌కు పంపారు. ప్రపంచకప్‌లో కోహ్లి గెలవాలి.. టీమిండియాను గెలిపించాలని వారు కోరుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement