PC: ICC
NZ Vs Ban 2nd test: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైలీ జెమీషన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. క్రైస్ట్‌చర్చ్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ మేరకు జరిమానా విధించింది. అంతేగాక డిసిప్లనరీ రికార్డులో డిమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
అసలేం జరిగిందంటే... రెండో టెస్టులో భాగంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో జెమీషన్ 41వ ఓవర్ వేశాడు. ఈ క్రమంలో బంగ్లా ఆటగాడు యాసిర్ అలీని అవుట్ చేసిన తర్వాత అభ్యంతరకర పదజాలం వాడాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ప్రవర్తనా నియమాళిలోని ఆర్టికల్ 2.5ని అనుసరించి చర్యలు చేపట్టింది.
మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది. కాగా అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక బ్యాటర్‌ను అవుట్ చేసిన తర్వాత వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే అత్యధికంగా 50 శాతం కోత విధించే అవకాశం ఉంటుంది. ఇక జెమీషన్ గతేడాది మార్చిలో బంగ్లాతో వన్డే మ్యాచ్ సందర్భంగా... 2020లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో ఇలాగే వ్యవహరించి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ మీద 117 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జెమీషన్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022 Title Sponsor: ఇకపై వివో ఐపీఎల్ కాదు.. టాటా ఐపీఎల్
What a way to finish the Test! @RossLTaylor takes his THIRD Test wicket to finish the Test inside 3 days at Hagley Oval. We finish the series 1-1 with @BCBtigers. #NZvBAN pic.twitter.com/2GaL0Ayapr
— BLACKCAPS (@BLACKCAPS) January 11, 2022
Comments
Please login to add a commentAdd a comment