Kyle Jamieson
-
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్‌తో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్‌డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్‌రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
CWC 2023: న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం.. స్టార్ బౌలర్‌కు పిలుపు
ప్రస్తుత ప్రపంచకప్‌లో గాయాలతో సతమతమవుతున్న న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడిన మ్యాట్ హెన్రీకి కవర్ అప్‌గా స్టార్ బౌలర్ కైల్ జేమీసన్‌ను ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇవాళ సాయంత్రానికంతా జేమీసన్ బెంగళూరుకు చేరుకుంటాడు. ఈ శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్ కోసం కివీస్ జట్టు కూడా ఇవాళ బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రపంచకప్‌కు ముందు కివీస్ బోర్డు జేమీసన్‌ను టిమ్ సౌథీకి కవర్ అప్‌గా ప్రకటించింది. అయితే సోథీ వేగంగా కోలుకోవడంతో జేమీసన్ స్వదేశంలోనే ఉండిపోయాడు. తాజాగా మ్యాట్ హెన్రీ గాయం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యూజిలాండ్ బోర్డు జేమీసన్‌ను భారత్‌కు పిలిపించింది. కివీస్ తదుపరి ఆడే మ్యాచ్‌లో హెన్రీ స్థానంలో జేమీసన్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. కాగా, నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. హెన్రీ తదనంతరం జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీంతో కివీస్ బోర్డు హుటాహుటిన జేమీసన్‌ను భారత్‌కు రావాల్సిందిగా కబురుపెట్టింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఒక్కసారిగా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్ రన్‌రేట్ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
సీఎస్కేకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జట్టులోకి ప్రోటీస్ పేసర్
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో జేమీసన్‌ను కోటి రూపాయల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన జమీసన్ స్ధానంలో దక్షిణాఫ్రికా సిసంద మగలాను చెన్నై సూపర్ కింగ్స్ ఎంపిక చేసింది. అతడిని రూ.50 లక్షల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది. కాగా మగలాకు దేశవాళీ టీ20 క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 127 టీ20లు ఆడిన మగలా.. 136 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తొట్ట తొలి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున ఆడిన మగలా.. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు సాధించాడు. కాగా అతడు దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: MS Dhoni: ‘రిటైర్మెంట్ సంగతి తెలీదు; ఫిట్‌గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడు’ -
NZ Vs Eng: కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక పేసర్ దూరం! సీఎస్కే కలవరం..
New Zealand vs England- Test Series: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ కైలీ జెమీషన్‌కు గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా జెమీషన్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జూన్ నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. నొప్పి లేకున్నా ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం జెమీషన్ కోలుకోవడంతో అతడిని స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 16 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో స్కానింగ్‌కు వెళ్లిన జెమీషన్‌కు ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. పెద్దగా నొప్పి లేకపోయినప్పటికీ.. అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు. అప్పుడే క్లారిటీ జెమీషన్‌కు శుక్రవారం మరోసారి సీటీ స్కాన్ నిర్వహించిన తర్వాతే ఫిబ్రవరి 24న ఆరంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. కాగా జట్టులో కీలక బౌలర్ అయిన జెమీషన్ దూరం కావడంతో కివీస్‌కు ఎదురుదెబ్బే. డ్రాగా మ్యాచ్ ఇక ఇంగ్లండ్‌తో హామిల్టన్‌లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జెమీషన్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగతా వాళ్లతో పోలిస్తే అత్యంత పొదుపుగా(ఎకానమీ 4.30) బౌలింగ్ చేశాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. సీఎస్కే కలవరం ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమీషన్ను గాయాల బెడద వేధిస్తుండటం సీఎస్కేను కలవరపెడుతోంది. దీంతో త్వరలోనే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్! WPL 2023: దాదాపు పదేళ్ల తర్వాత ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. మెరిసిన వైజాగ్ తేజం -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ఇదే! స్టార్ బౌలర్ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టిమ్ సౌథీ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గత ఏడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ కైల్ జేమీసన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 16 టెస్టులు ఆడిన జేమీసన్ 72 వికెట్లు సాధించాడు. మరోవైపు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే విధంగా ఈ జట్టులో స్పిన్నర్ ఆజాజ్ పటేల్, మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌కు చోటు దక్క లేదు. ఇక భారత్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్వేల్కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఈ హోం సిరీస్‌లో భాగంగా కివీస్ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. అయితే ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్(పింక్‌బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ తౌరంగ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరగనుంది. ఇంగ్లండ్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్. చదవండి: IND Vs AUS: కింగ్ ఈజ్ బ్యాక్.. జిమ్‌లో కోహ్లి కసరత్తులు! వీడియో వైరల్ -
ఆర్సీబీలో మహిళా థెరపిస్ట్.. కైల్ జేమిసన్‌తో సంబంధమేంటి?
ఐపీఎల్లో ఆర్సీబీకి ఉన్న క్రేజ్ వేరు. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినప్పటికి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. ప్రతీసారి పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ ఆటలో మాత్రం తడబడుతుంది. ఈ సీజన్లో కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడంతో దినేష్ కార్తిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మరి నూతన సారధ్యంలో ఆర్సీబీ కప్ కొడుతుందా అన్నది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. ఆర్సీబీ యాజమాన్యం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని తన ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. '' ముందుగా ఆర్సీబీ జట్టులో థెరపిస్ట్‌గా పనిచేస్తున్న నవనీతా గౌతమ్‌కు ప్రత్యేక అభినందనలు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ నిజంగా సూపర్ హీరోలే.. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ రాసుకొచ్చింది.ఆర్సీబీ నవ్‌నీతా గౌత్మ్కు శుభాకాంక్షలు చెప్పగానే సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఒక విషయాన్ని గుర్తుచేశారు. ''నవనీతా గౌతమ్.. కైల్ జేమిసన్ ఎక్కడ?'' అంటూ అడిగారు. అదేంటి నవ్నీతాకు, జేమిసన్‌కు రిలేషన్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. విషయంలోకి వెళితే.. గతేడాది సీజన్లో అబుదాబి వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 53 పరుగులతో ఆడుతుంది. బ్రేక్ సమయంలో కెమెరామెన్ ఒకసారి ఆర్సీబీ కూర్చొన్న డగౌట్ వైపు తిప్పాడు. అక్కడ ఒక ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కైల్ జేమిసన్ ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉండగా.. అతనికి వెనకాల నవనీతా గౌతమ్ కూర్చొని ఉంది.వారిద్దరో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ కెమెరా వారివైపు చూసేసరికి ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చిరునవ్వులు ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని అభిమానులు మరోసారి తాజాగా గుర్తుచేసుకుంటూ ఫన్నీ కామెంట్ చేశారు. ఎవరీ నవనీతా గౌతమ్.. కెనడాలోని వాంకోవర్‌లో ఏప్రిల్ 11, 1992లో నవనీతా గౌతమ్ జన్మించింది. థెరపిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నవనీతా గ్లోబల్ టి20 కెనడా టీంకు మొదట మసాజ్ థెరపిస్ట్‌గా సేవలందించింది. ఆ తర్వాత ఆసియా కప్ క్యాంపెయిన్ సందర్భంగా భారతీయ మహిళా బాస్కెట్‌బాల్ జట్టుకు స్టాఫ్ సపోర్ట్‌గా వ్యవహరించింది. ఇక 2019లో ఆర్సీబీలో స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్‌గా జాయిన్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న జట్లలో ఏకైక మహిళా థెరపిస్ట్ నవనీతా గౌతమ్ మాత్రమే. చదవండి: IPL 2022: ధోని క్రేజ్ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం To all the women out there, you are the real superheroes! Wish you a very Happy Women’s Day! 🙌🏻🤩🦸♀️ #PlayBold #WomensDay #WeAreChallengers pic.twitter.com/ti4sUr2kMX — Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2022 If this isn't the next best idea for Imperial Blue's 'men will be men' series then I don't know what is😂 pic.twitter.com/L3IECeXH3R — Kanav Bali🏏 (@Concussion__Sub) September 20, 2021 -
IPL 2022: అందుకే ఐపీఎల్ మెగా వేలానికి దూరం: స్టార్ ప్లేయర్
‘‘అవును... రెండు విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. 12 నెలల పాటు బయోబబుల్‌లో ఉండటం.. ఐసోలేషన్, క్వారంటైన్లో గడపటం... కాబట్టి రానున్న 12 నెలల పాటు షెడ్యూల్‌ను నాకు అనుగుణంగా మలచుకోవాలనుకుంటున్నాను. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కుటుంబంతో కలిసి సమయం గడపాలనుకుంటున్నాను’’ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైలీ జెమీసన్ అన్నాడు. కాగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన జెమీసన్... ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. గతేడాది మినీ వేలంలో భాగంగా రూ. 15 కోట్లు పలికిన అతడు ఈ మేరకు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన కైలీ జెమీసన్... మెగా వేలానికి దూరంగా ఉండటానికి గల కారణాలు వెల్లడించాడు. బయోబబుల్ నిబంధనలు ఒక రీజన్ అయితే.. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగ్గా రాణించడం కోసం మరింత కసరత్తు చేయాల్సి ఉందని, ఆ దిశగా దృష్టి సారించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ‘‘గత రెండేళ్లుగా నా కెరీర్ సాగుతున్న తీరు చూసుకుంటే.. నేనింకా అంతర్జాతీయ క్రికెట్లో చేయాల్సింది చాలా ఉంది. న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే నేను ఎప్పటికపుడు గేమ్‌పై వర్క్ చేయాలి. అప్పుడే మిగతా ఆటగాళ్లతో పోటీ పడగలను. కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటమే నాకు ముఖ్యం’’ అని జెమీసన్ పేర్కొన్నాడు. ఇక గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన జేమీసన్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం మెరుగ్గా రాణించాడు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహణకు ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. చదవండి: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక -
IPL 2022 Auction: గత సీజన్లో 15 కోట్లు పలికాడు.. ఇప్పుడేమో..!
Kyle Jamieson Pulls Out Of IPL 2022 Mega Auction: గతేడాది ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్.. త్వరలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ నుంచి మొత్తం 24 మంది వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. అందులో జేమీసన్ పేరు కనపడలేదు. గతేడాది జరిగిన వేలం సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. జేమీసన్‌ను ఏకంగా రూ. 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బౌలర్ల జాబితాలో అత్యధిక ధర పలికిన ఆటగాడు జేమీసనే కావడం విశేషం. అయితే ఆ సీజన్లో అతను పెద్దగా రాణించకపోవడంతో మెగా వేలానికి ముందు ఆర్సీబీ అతన్ని వదులుకుంది. గత సీజన్లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన జేమీసన్ 28 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా, ఇటీవలి కాలంలో జేమీసన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్ వేలంలో పాల్గొనలేకపోవడం విశేషం. బయో బబుల్‌కు బయపడే అతను క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్-2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. చదవండి: 24 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ.. అయితే..? -
ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే!
ICC Test Rankings: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా పలు టెస్టు సిరీస్‌లు జరుగుతున్న తరుణంలో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం రెండో ర్యాంకును కాపాడుకోగా... న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకి విలియమ్సన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా టీమిండియా బ్యాటర్లలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ(781), టెస్టు సారథి విరాట్ కోహ్లి(740) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. వరుసగా 5, 8 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంకు సాధించాడు. బౌలింగ్ విభాగంలో... టీమిండియా నుంచి అశ్విన్ ఒక్కడే.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 895 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకోగా... టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 861 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. షాహిన్ ఆఫ్రిది, కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్, టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్, నీల్ వాగ్నర్, హసన్ అలీ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున అశ్విన్ మినహా ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. 🔼 Steve Smith overtakes Kane Williamson 🔼 Kyle Jamieson launches into third spot The latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 👇 Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES — ICC (@ICC) January 12, 2022 -
NZ Vs Ban 2nd Test: భారీ విజయం.. కివీస్ ఆటగాడికి ఊహించని షాక్
NZ Vs Ban 2nd test: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైలీ జెమీషన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. క్రైస్ట్‌చర్చ్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ మేరకు జరిమానా విధించింది. అంతేగాక డిసిప్లనరీ రికార్డులో డిమెరిట్ పాయింట్‌ను చేర్చింది. అసలేం జరిగిందంటే... రెండో టెస్టులో భాగంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో జెమీషన్ 41వ ఓవర్ వేశాడు. ఈ క్రమంలో బంగ్లా ఆటగాడు యాసిర్ అలీని అవుట్ చేసిన తర్వాత అభ్యంతరకర పదజాలం వాడాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ప్రవర్తనా నియమాళిలోని ఆర్టికల్ 2.5ని అనుసరించి చర్యలు చేపట్టింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది. కాగా అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక బ్యాటర్‌ను అవుట్ చేసిన తర్వాత వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే అత్యధికంగా 50 శాతం కోత విధించే అవకాశం ఉంటుంది. ఇక జెమీషన్ గతేడాది మార్చిలో బంగ్లాతో వన్డే మ్యాచ్ సందర్భంగా... 2020లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో ఇలాగే వ్యవహరించి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ మీద 117 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో జెమీషన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022 Title Sponsor: ఇకపై వివో ఐపీఎల్ కాదు.. టాటా ఐపీఎల్ What a way to finish the Test! @RossLTaylor takes his THIRD Test wicket to finish the Test inside 3 days at Hagley Oval. We finish the series 1-1 with @BCBtigers. #NZvBAN pic.twitter.com/2GaL0Ayapr — BLACKCAPS (@BLACKCAPS) January 11, 2022 -
'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' ఎవరు? రేసులో టీమిండియా స్పిన్నర్
టెస్టు క్రికెట్లో ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఇక 2021 సంవత్సరానికి పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల నామినేషన్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఉన్నారు. ►ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్లో 15 టెస్టులాడి 1708 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తర్వాత రూట్ ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసి మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ జట్టుగా విఫలమైనప్పటికి రూట్ మాత్రం స్థిరంగా రాణించడం విశేషం. ►టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఈ ఏడాది అత్యద్బుత ఫామ్‌ను కనబరిచాడు. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీసిన అశ్విన్ బ్యాటింగ్‌లోనూ 337 పరుగులు సాధించాడు. ఇందులో ఒక టెస్టు సెంచరీ ఉండడం విశేషం. ►ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మంచి పేరు సంపాదించాడు. ఈ 12 నెలల కాలంలో జేమిసన్ ఐదు టెస్టు మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టు టెస్టులో తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడంలో జేమీసన్ కీలకపాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జేమీసన్ అద్భుతంగా రాణించాడు. ►శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఈ ఏడాది టెస్టు ఓపెనర్‌గా అద్భుతంగా ఆడాడు. ఏడు మ్యాచ్‌ల్లో 902 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వరుసగా శతకాలు బాది లంక బెస్ట్ ఓపెనర్‌గా అవార్డు నామినేషన్లో చోటు దక్కించుకున్నాడు. -
టాప్-5లోకి దూసుకొచ్చిన షాహిన్.. దిగజారిన విలియమ్సన్
ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. టీమిండియాతో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో 888 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(805 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీలతో మెరిసిన లాథమ్ 726 పాయింట్లతో 5 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న లంక కెప్టెన్ కరుణరత్నే 4 స్థానాలు ఎగబాకి పాయింట్లతో ఏడో స్థానంలో నిలలిచాడు. చదవండి: రెండో టెస్టుకు సాహా దూరం.. కేఎస్ భరత్‌కు అవకాశం! ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది స్థానాలు ఎగబాకి పాయింట్లతో తొలిసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన షాహిన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆకట్టుకున్న కైల్ జేమీసన్ 6 స్థానాలు ఎగబాకి 776 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ 840 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 763 పాయింట్లతో బుమ్రా ఒకస్థానం దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. చదవండి: Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది Afridi, Jamieson, Latham and Karunaratne on the charge 👊 All the latest changes in the @MRFWorldwide Test player rankings 👉 https://t.co/sBZWT92hhH pic.twitter.com/4dHZoUV67z — ICC (@ICC) December 1, 2021 -
గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి
Irfan Pathan Pointed Out Flaw In Opener Shubman Gill: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తొలి ఇన్నింగ్స్‌లో అర్దసెంచరీ సాధించిన గిల్ కైల్ జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అదే రీతిలో సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా వికెట్ సమర్పించుకున్నాడు. కైల్ జెమీషన్ వేసిన అద్భుత స్వింగ్ డెలివరీకి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో గిల్ అవుటైన తీరుపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గిల్ బ్యాటింగ్ స్టైల్ గురించి పఠాన్ మాట్లాడూతూ.. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకోవాలని సూచించాడు. "అతడు ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉంది. ఆ బంతులను అతడు ఎదరుర్కొంటే చాలు.. తిరుగు ఉండదు. గిల్ అవుటైన విధానం గమనిస్తే.. అతడి రెండు పాదాలు ఒకే చోట ఉన్నాయి. అందుకే బ్యాట్‌తో బంతిని ఆపేందుకు సమయం పట్టింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడటం అంత సులభంకాదు. కాన్పూర్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతోంది. అంతేకాకుండా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌పై సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. దీంతో తొందరగా పెవిలియన్‌కు చేరుతుంటారు. గిల్ మాత్రం తన బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టిసారించాలి. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలడు" అని పఠాన్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాట్లాడూతూ.. గిల్‌కు ఉన్న బ్యాటింగ్ టెక్నిక్కు ఓపెనింగ్ కంటే మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇస్తే బాగుటుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది! -
IND vs NZ: డిఫెన్స్ ఆడాలనుకున్నాడు.. అవకాశమే ఇవ్వలేదు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కైల్ జేమీసన్ వేసిన అద్భుత డెలివరీకి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే జేమీసన్ షాక్ ఇచ్చాడు. చదవండి: Kyle Jamieson: 1865 బంతులు.. కైల్ జేమీసన్ అరుదైన ఘనత జేమిసన్ వేసిన షార్ట్‌పిచ్ బంతి ఔట్‌సైడ్ దిశగా వెళ్లడంతో గిల్ ఢిపెన్స్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ అవకాశం లేకుండానే అనూహ్యంగా బంతి టర్న్ అయి గిల్ బ్యాట్, ప్యాడ్ల మధ్య గ్యాప్ నుంచి వెళ్లి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఈ దెబ్బకు గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. https://www.bcci.tv/videos/157270/ind-vs-nz-2021-1st-test-day-3-shubman-gill-wicket -
1865 బంతులు.. కైల్ జేమీసన్ అరుదైన ఘనత
Kyle Jamieson 3rd Bowler Fewest Balls Taken For 50 Test Wickets.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. 20వ శతాబ్దం నుంచి చూసుకుంటే అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న జాబితాలో జేమీసన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా జేమీసన్ టెస్టుల్లో 50వ వికెట్ తీసుకున్నాడు. చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్‌గా జేమీసన్ 50 వికెట్ల మార్క్ అందుకునేందుకు 1865 బంతులు తీసుకొని మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్(1240 బంతుల్లో 50 వికెట్లు) తొలి స్థానంలో.. 1844 బంతుల్లో 50 వికెట్లు తీసిన ఆసీస్ స్పీడస్టర్ బ్రెట్ లీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక 1880 బంతుల్లో 50 వికెట్లు తీసిన ఫ్రాంక్ టైసన్(ఇంగ్లండ్).. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్(1943 బంతుల్లో 50 వికెట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అత్యంత తక్కువ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి న్యూజిలాండ్ పేసర్‌గా కైల్ జేమిసన్ నిలిచాడు. ఇంతకముందు 50 వికెట్ల మార్క్‌ను చేరుకునేందుకు షేడ్ బాండ్ 12 టెస్టులు.. క్రిస్ మార్టిన్ 13 టెస్టులు తీసుకున్నారు. చదవండి: పేర్లలో కన్ఫూజన్.. ఈసారి జడేజాదే పైచేయి ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడోరోజు ఆట ముగిసేసమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే
Fans Troll Ajinkya Rahane For Batting Failure Vs NZ.. అజింక్యా రహానే బ్యాటర్‌గా మరోసారి ఫెయిలయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రహానే 35 పరుగులు చేసి కైల్ జేమిసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆరంభంలో కాస్త తడబడినా.. తర్వాత ఇన్నింగ్స్‌లో నిలకడ చూపించడంతో రహానే ఈసారి సెంచరీ కొడుతాడని ఆశించారు. కానీ 35 పరుగుల వద్దకు చేరగానే ఇక చాలు అనుకున్నాడేమో.. నిర్లక్ష్యంగా వికెట్ ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమవడంతో అతని స్థానంలో రహానే సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే బ్యాటర్‌గా రహానే మరోసారి విఫలం కావడంతో సోషల్ మీడియాలో వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ వర్షం కురిపించారు. ''కెప్టెన్ అయి బతికిపోయావు.. లేకుంటే ఎప్పుడో పక్కనపెట్టేవారు.. నాకు తెలిసి రహానే తర్వాతి మ్యాచ్ ఆడడం కష్టమే.. రహానేకు గడ్డుకాలం నడుస్తుంది.. ఇంకా ఎన్నాళ్లు వెంటాడుతుందో చూడాలి.. పెద్ద స్కోర్ చేస్తాడు అన్న ప్రతీసారీ వికెట్ ఇచ్చేసుకుంటాడు.. రహానే నుంచి పెద్ద స్కోరు ఆశించడం ఇక వ్యర్థం '' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం మూడో సెషన్ నడుస్తుండగా.. టీమిండియా 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 50, రవీంద్ర జడేజా 20 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: India vs New Zealand Test: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర... IND vs NZ 2021, 1st Test, Day 1: Ajinkya Rahane Wicket https://t.co/cO39SHQ7yG — sakshi analytics (@AnalyticsSakshi) November 25, 2021 Why is Rahane captaining the team from which he should be dropped😭😭😭 — A K S H A T (@akshat_1301) November 25, 2021 Rahane has to score in this series pic.twitter.com/ldTUA8EQrg — Savage (@CutestFunniest) November 24, 2021 Rahane utne he run banata hai jitne mai next match ki position fix ho jae uski. Na zayada, Na kam. #INDVsNZ — Yaman (@Oye_lambu) November 25, 2021 Whenever we feel rahane will score big today, he gifts his wicket away!! — Yash Shah (@YashShah1231) November 25, 2021 -
తొలి టీ20 మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్...
Kyle Jamieson pulls out of New Zealand T20I Series against India: టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ భారత్‌తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌పై దృష్టి సారించేందకు అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కాగా గాయం కారణంగా కెప్టెన్ విలియమ్సన్ జట్టు నుంచి తప్పుకోగా, ఇప్పుడు జేమీసన్ జట్టుకు దూరమయ్యాడు. ఇక విలియమ్సన్ జట్టు నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా బుధవారం(నవంబర్17)న జైపూర్ వేదికగా తొలి న్యూజిలాండ్- భారత్ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. "కేన్ విలియమ్సన్, కైల్ జేమీసన్ తో మాట్లాడాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వారిద్దరూ భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండబోతున్నారు. టెస్ట్ సిరీస్‌లో ఆడబోయే మిగతా ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడరు. వాళ్ల స్ధానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇస్తాం. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కావాలి అని స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ 1st T20 2021: 'ఓపెనర్లుగా రోహిత్, రాహుల్.. వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు నో ఛాన్స్' -
‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో టీమిండియా మహిళా క్రికెటర్లు
దుబాయ్: జూన్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. కాగా టీమిండియా మహిళల జట్టు నుంచి భారత టీనేజ్ బ్యాట్స్‌వుమెన్ షఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ మహిళల కేటగిరీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో రాణించడం ద్వారా గత నెల అవార్డు రేసులో ఉన్నారు. అరంగేట్రం చేసిన టెస్టులోనే వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కి భారత జట్టును ‘డ్రా’తో గట్టెక్కించారు. ఇక పురుషుల కేటగిరీలో న్యూజిలాండ్ క్రికెటర్లు డెవన్ కాన్వే, జేమీసన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ అవార్డు రేసులో ఉన్నారు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ జేమిసన్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు మొత్తంగా ఏడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్‌లో డెవన్ కాన్వే మెరిశాడు. కాగా ఈసారి టీమిండియా పురుషుల జట్టు నుంచి ఒక్కరు కూడా ఎంపికవలేదు. ఇక షఫాలీ వర్మ టీ 20 ఫార్మాట్లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకోవడంతో పాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ స్నేహ్రాణా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్ బౌలర్సోఫీ ఎకిల్‌స్టోన్ 8 వికెట్లు పడగొట్టింది. -
మళ్లీ టాప్‌లో కేన్ విలియమ్సన్; కెరీర్ బెస్ట్‌కు కైల్ జేమిసన్
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండువారాల క్రితం ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్‌కు కోల్పోయిన టాప్ ర్యాంకును తాజాగా మరోసారి చేజెక్కించుకున్నాడు. టీమిండియాతో జరిగిన ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కేన్ 49, 52 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో మెప్పించిన కేన్ మొత్తంగా 900 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 812 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్ ఒకస్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు,రెండో ఇన్నింగ్స్‌లో రెండు.. మొత్తంగా ఏడు వికెట్లు తీసిన కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జేమిసన్ 13వ స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్ ఓపెనర్ డెవన్ కాన్వే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్టార్ బౌలర్ పాట్ కమిన్స్(908 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్(865 పాయింట్లు) రెండో స్థానంలో, కివీస్ బౌలర్ టిమ్ సౌథీ(824 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా తన టాప్ ర్యాంక్‌ను జాసన్ హోల్డర్(384 పాయింట్లు) కోల్పోయి స్టోక్స్‌తో కలిసి 377 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పంత్.. మాస్క్ లేదంటూ ప్రశ్నల వర్షం 🇳🇿 @BLACKCAPS captain Kane Williamson is back to the No.1 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting. Full list: https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/1DWGBonmF2 — ICC (@ICC) June 30, 2021 -
బౌలింగ్‌లో స్థిరత్వం.. అతనికి కోట్లు వచ్చేలా చేసింది
చెన్నై: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్‌ను ఆర్సీబీ రూ. 15 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే.అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా.. వేలంలో అంత ధర పలకడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జేమిసన్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ హీరో హర్షల్ పటేల్ జేమిసన్ ప్రదర్శనపై స్పందించాడు. బౌలింగ్‌లో స్థిరత్వం ఉండడం అతనికి కలిసొచ్చిన అంశం అని అభిప్రాయపడ్డాడు. ''అతను బౌలింగ్ వేసే సమయంలో చూపించే పట్టుదల నాకు బాగా నచ్చింది. ఒక బౌలర్‌గా 6 అడుగుల 8 అంగుళాలు ఉండడం అతనికి కలిసొచ్చింది. కొత్త బంతితో స్థిరంగా బౌన్సర్లు రాబట్టగల నైపుణ్యం అతనిలో ఉంది. అలాగే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న అతను మరోసారి దానిని ముంబైతో మ్యాచ్‌లో నిరూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతను వేసిన యార్కర్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జేమిసన్ పవర్ ధాటికి కృనాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. అతని బౌలింగ్‌లో ఉన్న స్థిరత్వమే ఆర్సీబీకి వేలంలో కోట్ల రూపాయలకు దక్కించుకునేలా చేసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై ఈ ఫీట్ చేసిన ఏకైక బౌలర్‌గా హర్షల్ నిలవడం విశేషం. కాగా ముంబైతో జరిగిన ఆ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ డివిలియర్స్ మెరుపులతో ఆఖరిబంతికి విజయాన్ని సాధించింది. కాగా ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. చదవండి: ‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’ -
వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది
చెన్నై: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను కైల్ జేమిసన్ వేయగా.. పొలార్డ్, కృనాల్ క్రీజులో ఉన్నారు. కాగా 19వ ఓవర్ మూడో బంతిని జేమిసన్ యార్కర్ వేశాడు. దానిని ఎదుర్కోవడంలో కృనాల్ విఫలం కాగా.. బంతి బ్యాట్‌ను బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్‌కున్న హ్యాండిల్ హుక్ ఊడి బయటకొచ్చింది. దీనిని చూసి కృనాల్ మొదట షాక్ అయినా.. ఆ తర్వాత రెండు ముక్కలైన తన బ్యాట్‌ను చూసి నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ''వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది.. బుల్లెట్ లాంటి బంతికి కృనాల్ దగ్గర సమాధానం లేకుండా పోయింది'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో లిన్ 49 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సుందర్, జేమిసన్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: ఒక ఓపెనర్‌కు రెస్ట్.. మరొక ఓపెనర్ క్వారంటైన్లో కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. రోహిత్ రనౌట్ -
చహల్.. ఇమిటేట్ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా
చెన్నై: టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఎంత చలాకీగా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎదుటివారిని ఇమిటేట్ చేయడంలో చహల్ కాస్త ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో చహల్ డబ్య్లూడబ్లూఈ స్టార్ రెజ్లర్ అండర్‌టేకర్‌ను ఇమిటేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని ప్రాక్టీస్ ఆరంభించిన చహల్ ఒక ఫన్నీ వీడియోతో ముందుకొచ్చాడు. ఆ వీడియోలో చహల్ అండర్టేకర్ థీమ్ సాంగ్‌కు అతని వాకింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ నడుచుకుంటూ వచ్చాడు. చహల్ వెనుకే కైల్ జేమిసన్ కూడా వెంట వచ్చాడు. అసలే జేమిసన్ అండర్టేకర్లాగే 7 ఫీట్ ఉండడం.. అచ్చం అతన్ని అనుకరించడంతో నవ్వులు పూయిస్తుంది. ఈ సందర్భంగా ఐపీఎల్‌ను వ్రెసల్మేనియాతో పోలుస్తూ.. ''చాలెంజర్స్ ఆర్ రెడీ ఫర్ వ్రెసల్‌మేనియా విత్ కైల్ జేమిసన్'' అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఈ వీడియోనూ ఆర్సీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా నేటి మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ ఎలాగైనా విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని భావిస్తుంది. అయితే చహల్ ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మూడు వికెట్లు మాత్రమే తీసుకొని ఓవర్‌కు 12పైగా పరుగులు ఇచ్చుకున్న చహల్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. అయితే తన మ్యాజిక్ స్పిన్‌తో ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మార్చేయగల సత్తా చహల్ సొంతం. ఇక వ్రెస్లింగ్లో అండర్టేకర్ ఎన్నో రికార్డులు సాధించాడు. అత్యధిక వ్రెసల్మేనియాలు ఆడిన ఘనత సొంతం చేసుకున్న అండర్టేకర్.. మొత్తం 28 వ్రెసల్మేనియాల్లో పాల్గొని 25 విజయాలు.. రెండు పరాజయాలతో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: నా బౌలింగ్‌లో ఒక్క క్యాచ్ కూడా పట్టలేవ్! View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు
ఐపీఎల్–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్ పేసర్ జాయ్ రిచర్డ్సన్ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ టీమ్ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు. చెన్నై: ఎప్పటిలాగే ఐపీఎల్ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్ బద్దలు చేయడం విశేషం. ఐపీఎల్–2021 వేలం విశేషాలు చూస్తే... ► గత ఏడాది క్రిస్ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్ మోరిస్ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్ తప్పుకోవడంతో జేమీసన్ బెంగళూరు సొంతమయ్యాడు. ► మ్యాక్స్‌వెల్ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది. ► బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్ రిచర్డ్సన్ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్సీబీ చివరకు తప్పుకుంది. ► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేస్ బౌలర్ రిలీ మెరిడిత్ కోసం పంజాబ్ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది. ► వరల్డ్ నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది. ► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది. ► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ► గత ఐపీఎల్లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు. ► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్ టెండూల్కర్. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు. విహారికి నిరాశ... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్ టీమ్ సభ్యులలో లీగ్ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు. మళ్లీ ఐపీఎల్లో పుజారా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం! ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే... భారత సీనియర్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది. గౌతమ్‌కు రికార్డు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది. షారుఖ్ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా! తమిళనాడు జట్టు ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్ షారుఖ్ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్ మొదలు పెట్టగా, ఆర్సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ముగ్గురిని మాత్రమే... గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ టీమ్ కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు. వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్ జట్టునుంచి కె. భగత్ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు. ► కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు – బెంగళూరు) ► మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు) ► జాయ్ రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు – పంజాబ్) ► కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు – చెన్నై) ► రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు – పంజాబ్) ► మొయిన్ అలీ (రూ. 7 కోట్లు – చెన్నై) -
దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్
దుబాయ్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్ స్టోక్స్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో బొటనవేలి గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు దిగలేదు. కాగా జడేజా బొటనవేలికి శస్త్ర చికిత్స పూర్తయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా జడేజా ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టుతో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది. (చదవండి: సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్!) పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమిస్ 5 స్థానాలు ఎగబాకి టాప్ 5లో చోటు సంపాదించాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. స్మిత్ 900 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కాగా టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలవగా.. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే ఒక స్థానం దిగజారి 7వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా బౌలర్లు అశ్విన్, బుమ్రాలు 9, 10వ స్థానాల్లో నిలిచారు. (చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా') -
జేమీసన్‌కు తొలిసారి చోటు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తాజా సంచలనం కైల్ జేమీసన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ 2020–21 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్ ద్వారా వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల జేమీసన్ అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు... అనంతరం జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాట్‌తోనూ రాణించి కివీస్ సిరీస్‌ను 2–0 తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్, డేవన్ కాన్వేలు కూడా తొలిసారి ఈ జాబి తాలో చోటు దక్కించుకోగా... ఓపెనర్ మన్రో, జీత్ రావల్, ఇటీవల టెస్టుల నుంచి రిటైరైన టాడ్ ఆస్టల్లు తమ కాంట్రాక్టును కోల్పోయారు. మొత్తం 20 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టు లభించింది. న్యూజిలాండ్ కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితా: విలియమ్సన్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, ఫెర్గూసన్, గప్టిల్, హెన్రీ, జేమీసన్, టామ్ లాథమ్, నికోల్స్, సాన్ట్నెర్, నీషమ్, సౌతీ, రాస్ టేలర్, వాగ్నర్, వాట్లింగ్, ఎజాజ్ పటేల్, సోధి, బ్లన్‌డెల్, డేవన్ కాన్వే, విల్ యంగ్.