క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తాజా సంచలనం కైల్ జేమీసన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ 2020–21 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్ ద్వారా వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల జేమీసన్ అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు... అనంతరం జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాట్‌తోనూ రాణించి కివీస్ సిరీస్‌ను 2–0 తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్, డేవన్ కాన్వేలు కూడా తొలిసారి ఈ జాబి తాలో చోటు దక్కించుకోగా... ఓపెనర్ మన్రో, జీత్ రావల్, ఇటీవల టెస్టుల నుంచి రిటైరైన టాడ్ ఆస్టల్‌లు తమ కాంట్రాక్టును కోల్పోయారు. మొత్తం 20 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టు లభించింది.
న్యూజిలాండ్ కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితా: విలియమ్సన్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, ఫెర్గూసన్, గప్టిల్, హెన్రీ, జేమీసన్, టామ్ లాథమ్, నికోల్స్, సాన్‌ట్నెర్, నీషమ్, సౌతీ, రాస్ టేలర్, వాగ్నర్, వాట్లింగ్, ఎజాజ్ పటేల్, సోధి, బ్లన్‌డెల్, డేవన్ కాన్వే, విల్ యంగ్.
జేమీసన్‌కు తొలిసారి చోటు
Published Sat, May 16 2020 3:07 AM | Last Updated on Sat, May 16 2020 3:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment