ICC Test Rankings: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా పలు టెస్టు సిరీస్‌లు జరుగుతున్న తరుణంలో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం రెండో ర్యాంకును కాపాడుకోగా... న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకి విలియమ్సన్ స్థానాన్ని ఆక్రమించాడు.
ఇదిలా టీమిండియా బ్యాటర్లలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ(781), టెస్టు సారథి విరాట్ కోహ్లి(740) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. వరుసగా 5, 8 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంకు సాధించాడు.
బౌలింగ్ విభాగంలో... టీమిండియా నుంచి అశ్విన్ ఒక్కడే..
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 895 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకోగా... టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 861 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. షాహిన్ ఆఫ్రిది, కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్, టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్, నీల్ వాగ్నర్, హసన్ అలీ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున అశ్విన్ మినహా ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం.
చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..
🔼 Steve Smith overtakes Kane Williamson
— ICC (@ICC) January 12, 2022
🔼 Kyle Jamieson launches into third spot
The latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 👇
Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES
Comments
Please login to add a commentAdd a comment