Ind Vs Sa 3rd Test Updates
9:32 PM: రెండో రోజు ముగిసిన ఆట.. 70 పరుగుల లీడ్‌లో టీమిండియా
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అంతకుముందు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది.
8:46 PM: టీమిండియాకు వరుస షాక్‌లు.. 4 పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఔట్
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 210 పరుగులకు కట్టడి చేసిన ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. 5వ ఓవర్‌లో రబాడ్ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్(7) ఔట్ కాగా, ఆరో ఓవర్‌లో జన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్(10) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం టీమిండియా 37 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్‌లో పుజారా, కోహ్లి ఉన్నారు.
8:11 PM: ఐదేసిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 210 ఆలౌట్
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. ఎంగిడి 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
7:45 PM: రబాడ(14) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
200 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి రబాడ(15) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఒలీవియర్(4), ఎంగిడి ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 23 పరుగులు వెనుకపడి ఉంది.
6: 50 PM: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
మార్కో జాన్‌సెన్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా శిబిరంలో జోష్ నింపాడు. ఇక కొరకరాని కొయ్యగా తయారైన పీటర్సన్ 70 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటి వరకు 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ ప్రస్తుత స్కోరు: 176/7 (62.2). భారత్ కంటే 47 పరుగులు వెనుకబడి ఉంది.
6: 12 PM:
టీమిండియా బౌలర్ షమీ మరోసారి ఆకట్టుకున్నాడు. క్రీజులోకి వచ్చీ రాగానే వెరెనెను అవుట్ చేశాడు. పంత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ప్రొటిస్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 160/6 (56).
6: 07 PM:
పీటర్సన్, బవుమా భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. కీలక వికెట్ పడగొట్టాడు. అద్భుతమైన బంతితో అతడిని ఊరించి పెవిలియన్‌కు పంపాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లికి క్యాచ్ ఇచ్చి బవుమా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. కాగా ఈ క్యాచ్‌తో కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. వెరెనె, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 159/6 (55.4).
5: 30 PM:
►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ నిలకడగా ఆడుతున్నాడు. ఆచితూచి ఆడుతూనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 8 ఫోర్లు బాది 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా తెంబా బవుమా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 22 బంతులు ఎదుర్కొన్న బవుమా 15 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి.
►5: 05 PM: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి డసెన్ పెవిలియన్ చేరాడు. తెంబా బవుమా, పీటర్సన్ క్రీజులో ఉన్నారు.
4: 03 PM:
►లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు: 100/3 (35).
3: 47 PM:
►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. 88 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పీటర్సన్‌తో డసెన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుత స్కోరు: 91/3 (32). భారత బౌలర్లలో బుమ్రాకు రెండు, ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.
►3: 07 PM: దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు: 54/3 (21.4) . భారత్ కంటే 167 పరుగులు వెనకబడి ఉంది.
►3: 00 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. కేశవ్ మహరాజ్‌ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు.
►2: 05 PM: దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే బుమ్రా అద్భుత బంతితో మార్కరమ్‌ను బౌల్డ్ చేశాడు. కీగన్ పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు.
2: 00 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. మార్క్‌రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
ప్రొటిస్ బ్యాటర్లు ఎయిడెన్ మార్కరమ్ 8, కేశవ్ మహరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతకుముందు టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయింది.
►తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి.
చదవండి: SA vs IND: జస్‌ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్!
Kagiso Rabada well and truly enjoyed his 50th Test cap for the #Proteas🤩
— Cricket South Africa (@OfficialCSA) January 12, 2022
Day one full highlights: https://t.co/IfnLVkYlH0#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/G2t8387kyj
Comments
Please login to add a commentAdd a comment