టీమిండియా అండర్-19 ఆటగాడు హర్నూర్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన అండర్-19 అసియా కప్‌లోను రాణించిన హర్నూర్.. అండర్-19 వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లోనూ చేలరేగి ఆడుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్నూర్ సింగ్ సెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ 72 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 268 పరుగులకు ఆలౌటైంది.
ఇది ఇలా ఉంటే.. త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో హర్నూర్ సింగ్‌ను దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే పలు ప్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలస్తోంది. మెగా వేలంలో అతడికి భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. అతడి కోసం వేలంలో చాలా ప్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం బీసీసీఐ నిర్వహించనుంది.
చదవండి: IPL 2022: బీసీసీఐ పంట పండింది.. జాక్‌పాట్.. వివో నుంచి బోర్డుకు మరో రూ. 454 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment