
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ(జనవరి 12) ఉదయం ఇరు జట్లకు మెయిల్ చేసింది.
గతంలో ఆటగాళ్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గుర ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ఇవాళ ప్రకటించింది. నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది.
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
చదవండి: Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక