Lucknow Franchise
-
145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ ప్రతి జట్టు ఆటగాళ్ల ఎంపిక విషయంలో నిమగ్నమై ఉంది. ఏ ఆటగాడిపై ఎంత డబ్బు వెచ్చించాలనే అంశంలో ఆయా జట్లు కుస్తీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఎల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ జట్టు సభ్యులను ఎంచుకునే పనిలో బిజీగా ఉంది. రాహుల్‌తో పాటు డ్రాఫ్టెడ్ ఆటగాళ్లుగా మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను ఎంచుకున్న ఎల్ఎస్జే.. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడపై కన్నేసినట్లు తెలుస్తోంది. వేలంలో రబాడను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ జట్టు మాస్టర్ ప్లాన్ వేస్తుందని సమాచారం. ఇందుకోసం అతనిపై 12 కోట్ల వరకు వెచ్చించేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయమై జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ క్లూను వదిలాడు. 145 కిమీ పైగా వేగంతో నిప్పులు చెరిగే బౌలర్‌ను ఏ జట్టైనా కోరుకుంటుందని రబాడను ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. రబాడతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లైన మార్కో జన్సెన్, వాన్‌డెర్ డస్సెన్లపై కూడా లక్నో జట్టు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికి భారీ ధర చెల్లించి సొంతం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. కాగా, రబాడ గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అతనికి ఢిల్లీ జట్టు 4.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన రబాడ, 15 వికెట్లతో పర్వాలేదనిపించగా.. అంతకుముందు సీజన్(2020)లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 30 వికెట్ల సత్తా చాటాడు. అతను 2019 సీజన్లో సైతం 25 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన ఈ 26 ఏళ్ల స్టార్ పేసర్ మొత్తం 76 వికెట్లు తీశాడు. అయితే, ఈ ఏడాది రిటెన్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని వదులుకోవడం విశేషం. రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్‌ను రీటైన్ చేసుకున్న ఢిల్లీ.. రబాడ సహచరుడు నోర్జేను అంటిపెట్టుకుంది. చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు అంత సీన్ లేదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
కేఎల్ రాహుల్ ఐపీఎల్ జట్టు పేరు ఖరారు..
Sanjeev Goenka Revealed Lucknow Franchise Name: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గొయెంకా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. లక్నో జట్టుకు పేరు ఖరారు చేసేందుకు ట్విట్టర్ వేదికగా ఓ పోల్‌ను నిర్వహించిన ఆర్పీఎస్జీ.. లక్నో వాసులే పేరును సూచించాలని కోరింది. Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup unveils the name for the Lucknow IPL team. 😊👏🏼#LucknowSuperGiants #NaamBanaoNaamKamao #IPL2022 @IPL @BCCI @GautamGambhir @klrahul11 pic.twitter.com/TvGaZlIgFR — Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022 కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్న ఈ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా), రవి బిష్ణోయ్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీని రూ. 7,090 కోట్ల భారీ మొత్తం వెచ్చింది దక్కించుకున్న ఆర్పీఎస్జీ సంస్థ.. తమ పాత జట్టు ‘రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్’ లో ఊరు పేరు మాత్రమే మార్చి ‘లక్నో సూపర్ జెయింట్స్’గా ఖరారు చేయడం విశేషం. And here it is, Our identity, Our name.... 🤩🙌#NaamBanaoNaamKamao #LucknowSuperGiants @BCCI @IPL @GautamGambhir @klrahul11 pic.twitter.com/OVQaw39l3A — Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022 చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు -
IPL 2022: కేఎల్ రాహుల్‌కు జాక్‌పాట్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్
KL Rahul Signed For 17 Crores By Lucknow Franchise: టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ కొత్త జట్టైన లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్సీ పగ్గాలతో పాటు భారీ రెమ్యూనరేషన్‌ను పొందాడు. ఈ క్రమంలో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. 2018 ఐపీఎల్ వేలానికి ముందు బెంగళూరు జట్టు కోహ్లికి 17 కోట్లు ఆఫర్ చేయగా.. తాజాగా కేఎల్ రాహుల్‌కు సైతం లక్నో ఫ్రాంచైజీ అంతే మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. రాహుల్‌తో పాటు ఇదివరకే ఎంచుకున్న మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా లక్నో ఫ్రాంచైజీ భారీ ధరనే ఆఫర్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే, మరో కొత్త ఐపీఎల్ జట్టైన అహ్మదాబాద్.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ హార్ధిక్ పాండ్యాకి 15 కోట్లు చెల్లించి, కెప్టెన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలాగే అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి కూడా అదే మొత్తం(15 కోట్లు) చెల్లించేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ డీల్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా టీమిండియా టెస్ట్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా అహ్మదాబాద్ భారీ మొత్తం వెచ్చించింది. అతన్ని ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత! -
IPL 2022: కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ(జనవరి 12) ఉదయం ఇరు జట్లకు మెయిల్ చేసింది. గతంలో ఆటగాళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గుర ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ఇవాళ ప్రకటించింది. నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చదవండి: Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక తేదీలు ఖరారు..!
IPL 2022 Auction Dates Confirmed Says Reports: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల(ఫిబ్రవరి) 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయించింది. వేలానికి బెంగళూరు నగరం వేదికగా కానుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో వేలంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే షెడ్యూల్, వేదికల ఖరారు అంశం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో టాటా ఆ హక్కులకు చేజిక్కించుకుంది. చదవండి: IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి