KL Rahul Signed For 17 Crores By Lucknow Franchise: టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ కొత్త జట్టైన లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్సీ పగ్గాలతో పాటు భారీ రెమ్యూనరేషన్‌ను పొందాడు. ఈ క్రమంలో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. 2018 ఐపీఎల్ వేలానికి ముందు బెంగళూరు జట్టు కోహ్లికి 17 కోట్లు ఆఫర్ చేయగా.. తాజాగా కేఎల్ రాహుల్‌కు సైతం లక్నో ఫ్రాంచైజీ అంతే మొత్తం చెల్లించాలని నిర్ణయించింది.
రాహుల్‌తో పాటు ఇదివరకే ఎంచుకున్న మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా లక్నో ఫ్రాంచైజీ భారీ ధరనే ఆఫర్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదిలా ఉంటే, మరో కొత్త ఐపీఎల్ జట్టైన అహ్మదాబాద్.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ హార్ధిక్ పాండ్యాకి 15 కోట్లు చెల్లించి, కెప్టెన్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలాగే అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌కి కూడా అదే మొత్తం(15 కోట్లు) చెల్లించేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ డీల్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా టీమిండియా టెస్ట్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా అహ్మదాబాద్ భారీ మొత్తం వెచ్చించింది. అతన్ని ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment