IPL 2022: Lucknow IPL Team Named As Lucknow Super Giants, Deets Inside - Sakshi
Sakshi News home page

IPL Lucknow Team Name: లక్నో ఫ్రాంచైజీ పేరు ఇదే.. 

Published Mon, Jan 24 2022 9:50 PM | Last Updated on Tue, Jan 25 2022 8:27 AM

IPL Lucknow Franchise Named As Lucknow Super Giants - Sakshi

photo credit to sportskeeda

Sanjeev Goenka Revealed Lucknow Franchise Name: ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును  ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. లక్నో జట్టుకు పేరు ఖరారు చేసేందుకు ట్విట్టర్ వేదికగా ఓ పోల్‌ను నిర్వహించిన ఆర్పీఎస్జీ..  లక్నో వాసులే పేరును సూచించాలని కోరింది. 


కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్న ఈ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా, టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా), రవి బిష్ణోయ్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీని రూ. 7,090 కోట్ల భారీ మొత్తం వెచ్చింది దక్కించుకున్న ఆర్పీఎస్జీ సంస్థ.. తమ పాత జట్టు ‘రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్’ లో ఊరు పేరు మాత్రమే మార్చి ‘లక్నో సూపర్ జెయింట్స్’గా ఖరారు చేయడం విశేషం. 


చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో ఓట‌మిపై టీమిండియా హెడ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement