Ahmedabad Franchise
-
పీవీఎల్ ఛాంప్ అహ్మదాబాద్ డిఫెండర్స్
కొచ్చి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 15-7, 15-10, 1-20, 13-15, 15-10తో బెంగళూరు టోర్పిడోస్ జట్టుపై గెలిచింది. అహ్మదాబాద్ తరఫున అంగముత్తు రామస్వామి 16 పాయింట్లు, సంతోష్ 11 పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు తరఫున పంకజ్ శర్మ 11 పాయింట్లు, ముజీబ్ 9 పాయింట్లు సాధించారు. -
IPL 2022: శ్రేయస్‌కు షాక్.. హార్ధిక్ సహా మరో ఇద్దరిని ఎంచుకున్న అహ్మదాబాద్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ తాము ఎంచుకున్న ముగ్గురు క్రికెటర్ల పేర్లను బీసీసీఐకి సమర్పించింది. ఇప్పటికే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లను ఎంచుకున్న అహ్మదాబాద్ మూడో ప్లేయర్‌గా భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ మాజీ సభ్యుడు ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని అహ్మదాబాద్ పట్టుదల కనబరిచినా ఇషాన్ ఆసక్తి చూపకపోవడంతో గిల్‌వైపు ఆ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్లకు రూ. 15 కోట్ల చొప్పున... గిల్‌కు రూ. 7 కోట్లు అహ్మదాబాద్ చెల్లించనున్నట్లు సమాచారం. పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల శుబ్‌మన్ గిల్ భారత్ తరఫున 10 టెస్టులు, 3 వన్డేలు ఆడినా అంతర్జాతీయ టి20ల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడిన గిల్ 10 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 1,417 పరుగులు సాధించాడు. -
IPL 2022: కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ(జనవరి 12) ఉదయం ఇరు జట్లకు మెయిల్ చేసింది. గతంలో ఆటగాళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గుర ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ఇవాళ ప్రకటించింది. నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చదవండి: Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక తేదీలు ఖరారు..!
IPL 2022 Auction Dates Confirmed Says Reports: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల(ఫిబ్రవరి) 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయించింది. వేలానికి బెంగళూరు నగరం వేదికగా కానుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో వేలంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే షెడ్యూల్, వేదికల ఖరారు అంశం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో టాటా ఆ హక్కులకు చేజిక్కించుకుంది. చదవండి: IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి -
IPL 2022: శ్రేయస్‌కు షాక్.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..!
ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు సారధి ఎంపిక విషయంలో వేగంగా పావులు కదుపుతుంది. హెడ్ కోచ్(ఆశిష్ నెహ్రా), మెంటార్(గ్యారీ కిర్‌స్టెన్) విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన ఆ జట్టు.. కెప్టెన్ విషయంలోనూ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక దాదాపు ఖరారైనట్టేనని, అతనిపై రూ.15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో స్తబ్దత నెలకొంది. తాజాగా, ఆ వార్తలను కొట్టిపారేస్తూ.. ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అయ్యర్‌కి బదులు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హార్ధిక్‌తో పాటు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు ఇషాన్ కిషన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సదరు ఫ్రాంఛైజీకి చెందిన అధికారి ఒకరు జాతీయ మీడియాతో తెలిపినట్లు సమాచారం. ఇదే జరిగితే కెప్టెన్సీ చేపట్టాలనుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి భంగపాటు ఎదురైనట్టే. కాగా, అహ్మదాబాద్‌తో పాటు మరో ఐపీఎల్ అరంగేట్రం జట్టు లక్నో సైతం కెప్టెన్ ఎంపిక విషయంలో తలపట్టుకుంది. సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని ఆ ఫ్రాంఛైజీ.. హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించుకున్నప్పటికీ.. కెప్టెన్ విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక(ఫ్రీ టికెట్) చేసుకునేందుకు జనవరి 31 డెడ్‌లైన్ కావడంతో ఇరు ప్రాంఛైజీలు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయి. చదవండి: IPL 2022: ఆ ముగ్గురు ఎవరో జనవరి 31లోగా తేల్చుకోండి..!